Sripada Ramayanam in Telugu

540.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Valmiki Ramayanam
Sripada Ramayanam in Telugu

by Sripada Subramanya Sastry

శ్రీపాద రామాయణం
– శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి

  రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి రచించినది. అసలు సిసలైన తెలుగు రచయిత, తెలుగు కధక చక్రవర్తి, కలకండలాంటి తెలుగు రాయడంలో దిట్ట, తెలుగు వచనానికి కండబలం, గుండెబలం యిచ్చిన రచయిత – శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వాల్మీకి రామాయణాన్ని ఏకాండకు ఆకాండ చొప్పున బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు వాడుక తెలుగులో వచనానువాదం చేశారు. ఇంతటి సరళంగా, మూలం చెడకుండా అనువాదంచేసినవారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో!

శ్రీపాదవారి రామాయణం చదివినవారూ, విన్నవారూ కూడా పాపవిముక్తులవుతారు. ఇది ధనధాన్యసంపదలు కలిగిస్తుంది. కీర్తి, ఆయువూ వృద్ధిచేస్తుంది. కార్య నిర్వాహకులకు విజయసిద్ధి కలిగిస్తుంది. కొడుకులు కావాలనేవారు కొడుకులూ, ధనం కావలసినవారు ధనమూ, శ్రీరామపట్టాభిషేకం వింటే పొందుతారు. స్త్రీలందరూ రాముణ్ణి కని కౌసల్యలాగా, లక్ష్మణుణ్ణి కని సుమిత్రలాగా, భరతుణ్ణి కని కైక లాగా జీవపుత్రులై ఆనందిస్తారు. శ్రీపాదవారి రామాయణం విన్నవారు దీర్ఘయుష్మంతులవుతారు. ఆర్షమైన యీ ఆదికావ్యం ఎవరు శ్రద్ధగా వింటారో, వారు కష్టాలన్నీ గడిచి సుఖపడతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వెళ్ళి వారి బంధుమిత్రులను కలుసుకుంటారు. కోరికలన్నీ తీరి ఆనందం అనుభవిస్తారు. ఈ రామాయణం వింటే దేవత లానందిస్తారు. సకల విఘ్నాలూ తొలగిపోతాయి. అందరికీ జయం లభిస్తుంది. రజస్వలలైన స్త్రీలు కొడుకులను కంటారు. ఈ రామాయణం చదివేవాళ్ళ యెడలా, వినేవాళ్ళ యెడలా రాముడు దయాపరుడై ఉంటాడు. స్త్రీలిది వింటే కుటుంబవృద్ధీ, ఉత్తమసుఖమూ, సకలశుభాలూ పొందుతారు. ఇది ఆరోగ్యకరం, యశస్కరం, సౌభ్రాతృతకం, బుద్ధికరం, సుఖప్రదం. ఓరజస్కరమైన యీ ఆఖ్యానం నియమంగా వినాలి. ఇది విన్నా, గ్రహించినా దేవతలందరూ సంతుష్టులవుతారు. రామాయణం విన్నవారి పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వాల్మీకి మహర్షి రచించిన యీ గొప్పగ్రంథం యెవరు ప్రతిమీద ప్రతి చొప్పున పంచి పెడతారో వారు అంతమందీ స్వర్గానికి వెళతారు. తెలుగుపాఠకులారా! ఇది పూర్వం జరిగిన కధ. మీకు శుభాలు ప్రాప్తించాలి. మీరిది శ్రద్ధగా చదవండి. మీకు ఇష్టులైనవారికి బహుమతిగా ఇవ్వండి. విష్ణుమూర్తి మహాత్మ్యం అమోఘం.