Description
Sri Vamana Mahapuranam Sloka Tatparya Sahitam
శ్రీ వామన మహా పురాణం
వ్యాసుడు చేత రచింపబడ్డ పద్దెనిమిది పురాణాలలో వామన పురాణం ఒకటి. శ్రీమహావిష్ణువు త్రివిక్రమ స్వరూపుడైన బలి చక్రవర్తిని పాతళ లోకానికి పంపిన ఐదవ అవతారమైన వామన అవతారంపై ఆధారమైనది ఈ పురాణం. ఈ పురాణం పూర్వ భాగం ఉత్తర భాగం అంబే రెండు భాగాలుగా విభజింపబడింది. పూర్వభాగంలో 10 వేల శ్లోకాలు ఉన్నాయి, ఉత్తర భాగం ఇప్పుడు లభించడం లేదు. ఈ పురాణంలో శ్లోకాలే కాకుండా గద్య భాగాలు కూడా ఉన్నాయి. పూర్వ భాగంలో 97 అధ్యాయాలు ఉన్నాయి. కురుక్షేత్రం లోని బ్రహ్మ సరోవరాన్ని విశేషంగా 28 అధ్యాయలలో సరో మహత్యంగా అనే పేరుతో వర్ణింపబడుతుంది. బలి చక్రవర్తి జరిపిన యజ్ఞం కురుక్షేత్రంలో జరిపినట్లు చెప్పబడింది. ఈ పురాణానికి ప్రధాన వక్త పులస్త్యుడు శ్రోత నారదుడు.