Idee Yadhartha Mahabharatham

ఇదీ యథార్థ మహాభారతం

బ్రహ్మశ్రీ డా. సామవేదం షణ్ముఖ శర్మ

 

వ్యాసమహర్షుల వారి మహాభారత జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించిన సామవేదం షణ్ముఖ శర్మ గారి వ్యాఖ్యానం మొత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ తరం పాఠకులకు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన పుస్తకం ఇది.

600.00

+ Rs.90/- For Handling and Shipping Charges
Share Now

Description

Idee Yadhartha Mahabharatham
– By Bramha Sri Dr. Samavedam Shanmukha Sarma

ఇదీ యథార్థ మహాభారతం
బ్రహ్మశ్రీ డా. సామవేదం షణ్ముఖ శర్మ

“యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్” – “ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు” అని మహాభారతాన్ని ఉద్దేశించి వేద వ్యాసుడు చెప్పిన మాట ఇది..

పంచమ వేదంగా ప్రసిద్ధి పొందిన లక్ష శ్లోకాత్మక బృహద్గ్రంథం శ్రీ మహాభారతం.. అటువంటి విస్తారమైన గ్రంథాన్ని పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు పలు మార్లు ప్రవచించారు…

“కాలక్రమంలో బహుళ జనాదరణ వలన, వక్తలు – కవుల ఊహాప్రతిభ వల్ల బహు కల్పనలకు, చిలవలపాలవల పిట్టకథలకు లోనై అసలు కథ తెలియని పరిస్థితి ఏర్పడింది..

భారతంలో రెండు పక్షాలున్నట్లే – లోకంలో కూడా ఉంటాయి. అధర్మపక్షాన్ని సమర్థించే కుహనా మేధావులు విజృంభించి కువ్యాఖ్యలతో, అధ్యయన రాహిత్యంతో, వ్రాసిన రచనలు, తీసిన చిత్రాలు, నాటకాలు – కలి వైపరీత్యం వల్ల జనులలో చొచ్చుకుపోయాయి..

ఈ నేపథ్యంలో మూలభారతాన్ని ప్రమాణంగా తీసుకొని, 18 రోజులు చెప్పిన ప్రవచనానికి పుస్తక రూపమిది. ఈ గ్రంథం అజ్ఞాన నిశీధికి ఓ ఉషోదయం. ఇప్పటిదాకా వ్యాసభారతం చదవలేదని చింతించే వారికి అద్భుత అవకాశంగా దొరికిన ఒక విఙ్ఞాన రసగుళిక ఈ గ్రంథం.”

Samavedam Shanmukha Sarma Books