Description
వాల్మీకి రామాయణం
రచయిత : కొంపెల్ల వెంకట్రామ శాస్త్రి
Pages : 646
మొదటిరోజు: పారాయణ ప్రారంభానికి ముందుగా సకల సంబారాలు సిద్ధం చేసుకోవాలి. మందిరంలో సీతారాములు, ఆంజనేయస్వామి విగ్రహాలు/చిత్రపటాలు ఏర్పాటు చేసుకుని, గోమయంతో పూజ చేసే ప్రాంతాన్ని శుద్ధి చేసి, పూజా సంబారాలు సిద్ధం చేసుకోవాలి. గురుపూజ, వాల్మీకి పూజ, విఘ్నేశ్వర పూజ, మంటపారాధన, రామ కలశ స్థాపన అనంతరం హనుమత్సమేత సీతారాములకు షోడశోపచారాలతో అర్చన చేయాలి.
అనంతరం వాల్మీకి ధ్యానం చేసి ’తపస్వాధ్యాయ నిరతం…’ శ్లోకంతో ప్రారంభించి, మొదటి సర్గను పూర్తిగా పారాయణ చేయాలి. రామనామ స్మరణతో నిద్రకు ఉపక్రమించాలి.
రెండవరోజు: ద్వితీయ సర్గతో ప్రారంభించి బాలకాండ చివరి వరకు పారాయణ చేయాలి.
మూడవరోజు: అయోధ్య ప్రారంభం నుంచి 56వ సర్గ వరకు పారాయణ చేయాలి.
నాలుగవ రోజు: అయోధ్యకాండ 57వ సర్గ నుంచి అయోధకాండ చివరి వరకు పారాయణ చేయాలి.
ఐదవరోజు: అరణ్యకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఆరవరోజు: కిష్కింధకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఏడవరోజు: సుందరకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఎనిమిదవరోజు: యుద్ధకాండ 77వ సర్గ వరకు పారాయణ చేయాలి.
తొమ్మిదవ రోజు: యుద్ధకాండ 128వ సర్గ వరకు పారాయణ చేయాలి.
పదవరోజు: యుద్ధకాండలో మిగిలిన భాగం పూర్తిగా పారాయణ చేయాలి.
చివరిగా ఈ క్రిందిశ్లోకాన్ని మూడుసార్లు చదివి 12సార్లు నమస్కారం చేయాలి.
యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా!
తావద్వర్ష సహస్రాణి స్వామిత్వమవధారయ!!
చివరగా క్షమాప్రార్థన చేసి స్వామికి అనేక విధాలుగా నమస్కారాలు చేయాలి.