Description
Sri Matsya Maha Puranam
శ్రీ మత్స్య పురాణం
మత్స్య పురాణం, అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం.ఈ పురాణాన్ని “మత్స్యంమేధఃప్రకీర్యతే” అని వర్ణించబడింది.అంటే ఇది శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి.శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు. వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను వ్యాసమహర్షి రచించాడు.ఇందులోని 289 అధ్యాయాలలో మొదటిది సృష్టిక్రమం.