Description
శ్రీమద్రామాయణం, శ్రీమద్భగవద్గీత రెండూ పవిత్రగ్రంధాలే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరూ అవతార పురుషులే. మనకు ఆరాధ్యదైవాలే. అయితే ఒకానొక సమయంలో శ్రీరాముడు ఏమి చేస్తాడో దాన్ని చేయవద్దని, శ్రీరాముడు ఏమి చేయటానికి నిరాకరిస్తాడో దాన్ని చేయమని శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినట్టు మనకు తెలుస్తుంది. మనం జాగ్రత్తగా ఆ రెండు గ్రధాలను పరిశీలిస్తే అది ఎట్లో చూద్దాం. వనవాసం చేస్తున్న శ్రీరామునితో రతుడు, ‘అన్నా! అరణ్యమెక్కడ? రాజ్యపాలన ఎక్కడ? జటలెక్కడ? క్షత్రియధర్మం ఎక్కడ? రాజ్యాభిషేకమే క్షత్రియునికి ధర్మం. రాజ్యపాలన చేతనే అతడు ప్రజలను రక్షించగలడు. ఆ విధంగా ఫలాన్ని ప్రత్యక్షంగా పొందగలిగే క్షత్రియ ధర్మాన్ని వదలి, ఎప్పుడో ఏదో తెలియని ఫలాన్ని పొందవచ్చు అన్నాడు. (పుట 266-106వ సర్గ-అయోధ్యాకాండం-శ్రీమద్రామాయణం) యుద్ధం చేయను, భిక్షాన్నం తిని జీవిస్తాను కానీ యుద్ధంలో బంధుమిత్రులను, గురువ్ఞలను చంపి రాజ్యాన్ని పొంది, రాజ్యపాలన చేయను అని చెప్పిన అన్జునునితో శ్రీకృష్ణుడు దాదాపు ఇక్కడ భరతుడు ఏమి చెప్పాడో అలాగే చెప్పి యుద్ధాన్ని చేయటానికి, పాలన చేయటానికి అర్జునుడిని ఒప్పించాడు.
శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన బోధనే భరతుడు శ్రీరామునకు చేసిన బోధలాగుంది. అయినా శ్రీరాముడు దాన్ని అంగీకరించలేదు. తాను క్షత్రియుడే అయినా రాజ్యపాలన చేయటానికి ఆ సందర్భంలో ఆయన అంగీకరించలేదు. అరణ్యవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు. ఎందుకు? క్షత్రియునిగా క్షత్రియధర్మాన్ని నిర్వర్తించాలి కదా? ఎవరిని గర్చి ‘రామోవిగ్రహవాన్ ధర్మంః అని అన్నాడో ఆ రాముడే క్షత్రియ ధర్మాన్ని పాటించలేదు. ఎందుకు? శ్రీకృష్ణునికి తెలిపిన ధర్మం శ్రీరామునికి తెలియకనా? ఆయన ఏమని చెబుతాడో రామాయణ పుటలను తిప్పి చూద్దాం మరి. ‘ఓ భరతుడా! నీవ్ఞ శత్రుఘ్నునితో కలిసి అయోధ్యకు పోయేజనరంజకంగా పరిపాలించు.
నేను సీతాలక్ష్మణులతో కలిసి వనవాసవ్రతం పూర్తి చేస్తాను. నీవ్ఞ పోయి కోసలదేశానికి రాజువ్ఞకా! ఆ దేశప్రజలందరినీ రక్షించు. నేను ఇక్కడ అరణ్యానికి రాజు అవ్ఞతాను. ఇక్కడ ఉండే పశుపక్ష్యాదులను, తపశ్శాలురను, మునీశ్వరులను రక్షిస్తాను. ఆ విధంగా అడవ్ఞల్లో ఉంటూ కూడా క్షత్రియధర్మాన్ని కాపాడుకుంటాను. అయోధ్యలో రాజువై తెల్లని గొడుగునీడలో రాజ్యపాలన చెయ్యి. నేను ఇక్కడ అరణ్యంలోని చెట్టునీడలలో ఉంటూ వన్యజీవాలను కాపాడుతూ ఉంటాను. అయోధ్యలో శత్రుఘ్నుడు నీకు తోడునీడగా ఉంటాడు. ఇక్కడ అరణ్యంలో లక్ష్మణుడు నాకు తోడునీడగా ఉంటాడు.మన నలుగురం మన తండ్రి దశరథ మహారాజు సత్యవ్రతాన్ని నిలబెడదాం (పుట 268-107 వసర్గ -అయోధ్యాకాండము, శ్రీమద్రామాయణం). దీన్ని గమనిస్తే భరతుడు చెప్పినది క్షత్రియధర్మాన్ని గూర్చి మాత్రమే. అయితే శ్రీరాముడు చెబుతున్నది క్షత్రియధర్మాన్ని గూర్చి, దానితోపాటు పుత్రధర్మాన్ని గూర్చి కూడా. మాతృదేవోభవ! పితృదేవోభవ! అని చెబుతుంది వేదం.
దైవస్వరూపుడైన తండ్రి చేసిన వాగ్దానాలను నెరవేర్చటం, ఆజ్ఞలను పాటించటం పుత్రుల ధర్మం. కాబట్టి అరణ్యంలోనే ఉంటే క్షత్రియధర్మాన్ని, పుత్రధర్మాన్ని కూడా నిర్వర్తించినట్లవ్ఞతుందన్నది శ్రీరాముని అభిప్రాయం. అందుకే భరతుని మాటలను తిరస్కరించాడు. ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది. సమయం, సందర్భాన్ని బట్టి నిర్ణయించవలసి ఉంటుంది. యుద్ధం చేసి, శత్రువ్ఞలను సంహరించి, రాజ్యపాలన చేయటమే నీ కర్తవ్యమని అర్జునునకు శ్రీకృష్ణుడు చేసిన బోధ ధర్మమే. అభిషేకాన్ని తిరస్కరించి, రాజ్యపాలన చేయక, అరణ్యంలోనే ఉంటానని శ్రీరాముడు చెప్పిన మాట ధర్మమే. ధర్మనిర్ణయానికి విచక్షణాజ్ఞానం అత్యంత అవసరం. శ్రీమద్రామాయణ పఠనం మనలో దాన్ని పెంపొందించాలి.
—————-
మొదటిరోజు: పారాయణ ప్రారంభానికి ముందుగా సకల సంబారాలు సిద్ధం చేసుకోవాలి. మందిరంలో సీతారాములు, ఆంజనేయస్వామి విగ్రహాలు/చిత్రపటాలు ఏర్పాటు చేసుకుని, గోమయంతో పూజ చేసే ప్రాంతాన్ని శుద్ధి చేసి, పూజా సంబారాలు సిద్ధం చేసుకోవాలి. గురుపూజ, వాల్మీకి పూజ, విఘ్నేశ్వర పూజ, మంటపారాధన, రామ కలశ స్థాపన అనంతరం హనుమత్సమేత సీతారాములకు షోడశోపచారాలతో అర్చన చేయాలి.
అనంతరం వాల్మీకి ధ్యానం చేసి ’తపస్వాధ్యాయ నిరతం…’ శ్లోకంతో ప్రారంభించి, మొదటి సర్గను పూర్తిగా పారాయణ చేయాలి. రామనామ స్మరణతో నిద్రకు ఉపక్రమించాలి.
రెండవరోజు: ద్వితీయ సర్గతో ప్రారంభించి బాలకాండ చివరి వరకు పారాయణ చేయాలి.
మూడవరోజు: అయోధ్య ప్రారంభం నుంచి 56వ సర్గ వరకు పారాయణ చేయాలి.
నాలుగవ రోజు: అయోధ్యకాండ 57వ సర్గ నుంచి అయోధకాండ చివరి వరకు పారాయణ చేయాలి.
ఐదవరోజు: అరణ్యకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఆరవరోజు: కిష్కింధకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఏడవరోజు: సుందరకాండ పూర్తిగా పారాయణ చేయాలి.
ఎనిమిదవరోజు: యుద్ధకాండ 77వ సర్గ వరకు పారాయణ చేయాలి.
తొమ్మిదవ రోజు: యుద్ధకాండ 128వ సర్గ వరకు పారాయణ చేయాలి.
పదవరోజు: యుద్ధకాండలో మిగిలిన భాగం పూర్తిగా పారాయణ చేయాలి.
చివరిగా ఈ క్రిందిశ్లోకాన్ని మూడుసార్లు చదివి 12సార్లు నమస్కారం చేయాలి.
యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధరా!
తావద్వర్ష సహస్రాణి స్వామిత్వమవధారయ!!
చివరగా క్షమాప్రార్థన చేసి స్వామికి అనేక విధాలుగా నమస్కారాలు చేయాలి.
Send Your Messages Only 



































