Description
Sri Brahmanda Puranam
శ్రీ బ్రహ్మాండ మహా పురాణము
బ్రహ్మాండ పురాణము (Brahmanda Purana) ఒక హిందూ ధార్మిక గ్రంథము. ఇది ముఖ్యమైన పురాణాలలో ఒకటి. సంఖ్యాపరంగా దీనిని 18వ పురాణంగా చెబుతారు. ఈ గ్రంథంలో ఆధ్యాత్మ రామాయణము అంతర్గతమై ఉంది.
బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము (బ్రహ్మాండము) గురించి ఇందులో ఉన్నందున దీనికి “బ్రహ్మాండపురాణము” అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము (బ్రహ్మాండము) నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. ఇందులో మొత్తం 12,000 శ్లోకాలున్నాయి. ఒక బ్రాహ్మణునికి బహుమతిగా ఇవ్వడానికి ఇది ఉచితమైన గ్రంథమని చెబుతారు.