లింగ పురాణం హిందూమతం పవిత్ర గ్రంథాలైన అష్టాదశ పురాణాల్లో ఒకటి. ఇందులో ప్రధానంగా శైవ సంప్రదాయాల గురించి వివరించబడింది.
దీని రచయితను గురించి, రాయబడిన కాలం గురించి స్పష్టమైన వివరాలు లేవు. ఒక అంచనా ప్రకారం దీనిని క్రీ.పూ 5 నుంచి 10 వ శతాబ్దం మధ్యలో రాసి ఉండవచ్చు. ఈ గ్రంథం అనేక భిన్నమైన పాఠాంతరాల్లో లభ్యమౌతూ ఉంది. కాల గమనంలో అనేక మార్పులకు లోనవుతూ వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం గ్రంథం 163 అధ్యాయాలతో ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది.