Mahabharatham

మహాభారతం

రచయిత : తాళ్లూరి సీతారామ హర గోపాల్
Pages : 1040

525.00

+ Rs.30/- For Handling and Shipping Charges
Share Now

Description

మహాభారతం
రచయిత : తాళ్లూరి సీతారామ హర గోపాల్
Pages : 1040

మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. సాహిత్య చరిత్ర (History of Epic Literature) పక్రారం మహాభారత కావ్యము వేద కాలం తర్వాత, అనగా సుమారు 400 B.C లో దేవనాగరి భాష అనబడిన సంస్కృతం భాషలో రచించబడినది మహాభారత మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ) లు తెలుగు లోకి అనువదించారు. మహాభారతంలోని విభాగాలు
మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:

ఆది పర్వము : 1-19 ఉపపర్వాలు – పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
సభా పర్వము : 20-28 ఉపపర్వాలు – కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
వన పర్వము (లేక) అరణ్య పర్వము : 29-44 ఉపపర్వాలు – అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
విరాట పర్వము : 45-48 ఉపపర్వాలు – విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
ఉద్యోగ పర్వము : 49-59 ఉపపర్వాలు – కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
భీష్మ పర్వము : 60-64 ఉపపర్వాలు – భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
ద్రోణ పర్వము : 65-72 ఉపపర్వాలు – ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
కర్ణ పర్వము : 73 వ ఉపపర్వము – కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
శల్య పర్వము : 74-77 ఉపపర్వాలు – శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
సౌప్తిక పర్వము : 78-80 ఉపపర్వాలు – నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
స్త్రీ పర్వము : 81-85 ఉపపర్వాలు – గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
శాంతి పర్వము : 86-88 ఉపపర్వాలు – యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
అనుశాసనిక పర్వము : 89-90 ఉపపర్వాలు – భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
అశ్వమేధ పర్వము : 91-92 ఉపపర్వాలు – యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
ఆశ్రమవాస పర్వము : 93-95 ఉపపర్వాలు – ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
మౌసల పర్వము : 96వ ఉపపర్వం – యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
మహాప్రస్ధానిక పర్వ ము: 97వ ఉపపర్వం – పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
స్వర్గారోహణ పర్వము : 98వ ఉపపర్వం – పాండవులు స్వర్గాన్ని చేరడం.
హరివంశ పర్వము : శ్రీకృష్ణుని జీవితగాథ వీటిలో మొదటి అయిదు పర్వాలను ఆదిపంచకము అనీ, తరువాతి ఆరు పర్వాలను యుద్ధషట్కము అనీ, ఆ తరువాతి ఏడు పర్వాలను శాంతిసప్తకము అనీ అంటారు.

మహాభారతం ప్రత్యేకతలు
మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11