Description
Sri Brahma Vaivarta Maha Puranam Telugu
బ్రహ్మ వైవర్త పురాణం
బ్రహ్మ వైవర్త పురాణం ఓ సంస్కృత ఉద్గ్రంథం. హిందూ మతానికి చెందిన ప్రధాన పురాణం. ఇది కృష్ణుడు రాధల గురించిన వైష్ణవ గ్రంథం. ఆధునిక యుగ పురాణాలలో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు.
1 వ సహస్రాబ్ది చివరలో ఈ పురాణం యొక్క ఒక కూర్పు ఉనికిలో ఉన్నప్పటికీ, దాని ప్రస్తుత కూర్పు మాత్రం 15 లేదా 16 వ శతాబ్దంలో బెంగాల్ ప్రాంతంలో రచించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ పేరుతో పోలి ఉండే బ్రహ్మకైవర్త పురాణం అనే శీర్షికతో మరొక వచనం కూడా ఉంది. అది దీనికి సంబంధించినదే. దీన్ని దక్షిణ భారతదేశంలో రచించారు. ఈ పురాణం 274 లేదా 276 అధ్యాయాలలో, అనేక కూర్పులు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మవైవర్త పురాణం లేదా బ్రహ్మకైవర్త పురాణం లోని భాగమేనని చెప్పుకుంటారు.
కృష్ణుడిని సర్వోన్నత వాస్తవికతగా గుర్తించడం, విష్ణు, శివుడు, బ్రహ్మ, గణేశుడు వంటి దేవతలందరూ ఒకటేనని, అందరూ కృష్ణుడి అవతారాలేననీ ఈ పురాణం వక్కాణిస్తుంది. అలాగే రాధ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి వంటి దేవతలందరూ కూడా ఒక్కరేననీ, అందరూ ప్రకృతి అవతారాలేననీ కూడా చెబుతుంది. ఈ పురాణం స్త్రీకి ఉన్నత స్థానం కలిప్స్తుంది. మహిళలందరూ దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సహ సృష్టికర్త అనీ, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేననీ ఈ పురాణం వచిస్తుంది.
భాగవత పురాణంతో పాటు బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ-సంబంధిత హిందూ సంప్రదాయాలపైన, అలాగే రాసలీల వంటి నృత్య ప్రదర్శన కళలపై కూడా ప్రభావం చూపాయి