Description
Mahabharatam – Sri Chaganti Koteswara Rao
మనకి ఈ కలియుగంలో ఉండే ప్రజల ఆయుర్దాయాన్ని, సమర్ధతని దృష్టిలో పెట్టుకొని, వేదవ్యాస భగవానుడు ధర్మానికి ప్రధానమైన వేదాన్ని నాలుగుగా విభాగం చేసి, పరంపరాగతంగా అందరికీ అందడం కోసమని ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వణ వేదాన్ని సుమంతుడికి ఇచ్చారు. అప్పటినుంచి వేదం పరంపరాగతంగా అట్లా నేర్చుకోబడుతోంది. మనకి ధర్మానికి ప్రమాణం వేదం. అసలు ఎట్లా బ్రతకాలి, ఏ పని చేయాలి, ఏ పని చెయ్యకూడదు, చేయవలసిన పని ఎట్లా చేయాలి – ఈ విషయాలు తెలియాలంటే, వేదం చదువుకోవాలి. కలియుగంలో అందరూ వేదాన్ని చదువుకోలేరు, వేదం చేత ప్రతిపాదింపబడిన ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. అప్పుడు ధర్మానుష్ఠానం చేయడము అన్నది క్లిష్టమైన సమస్యగా మారుతుంది. అందుకే వ్యాస భగవానుడు వేదాంతర్గతమైన ధర్మం అందరికీ తెలియడం. కోసం మహాభారతాన్ని రచించి లోకానికి అందించారు.
srimadandhra mahabharatam pravachanam