Yoga Sadhana telugu

యోగ సాధన

(ఏకాగ్రత మరియు ధ్యానము)

594.00

Share Now

Description

విష య సూచిక

మొదటి అధ్యాయము ధారణనుగురించిన వివరములు  ధారణయన నేమి – ఎచ్చట ధారణ చేయవలెను – ధారణ లో
తోడ్పడునవి – అంతర్ముఖవృత్తి – మనస్సు యొక్క పోకడలను తెలిసి కొనుము. మనశ్చాంచల్యమును తగ్గించుము – శక్తుల నన్నింటిని వినియో గించుము – ధారణనుగురించిన గాధ – యోగప్రశ్నోత్తరి.
.
రెండవ అధ్యాయము ధారణను అభ్యసించుట అవధానము – ధారణను అభ్యసించుట జీవితమునందలి ప్రతి రంగమునందును ధారణకుగల స్థానము- ధారణాయోగముయొక్క సారము- ధారణను నేర్చుకొనుటకు అభ్యాసములు – కుర్చీపై ధారణచేయుట – అనాహత నాదములపై ధ్యానము చేయుట – త్రాటకము.

మూడవ అధ్యాయము ధ్యానమునకు కావలశిన ప్రాధమిక విషయములు ధ్యానమన నేమి – ధ్యానావశ్యకత – ధ్యానమువల్ల కలుగు లాభములు – బ్రాహ్మీముహూ ర్తము – ధ్యానము చేయు గది ధ్యానమునకు పనికివచ్చు ప్రదేశములు – ధ్యానము చేసికొనుటకై గుహలో నివసించుట ధ్యానము నభ్యసించుటకు ముందు ధ్యానముచేయు టెటుల – ఎప్పుడు ఎచ్చట ధ్యానము చేయవలెను ధ్యానమునకు కావలసిన ఆవశ్యకతలు – ముమ్మారు థ్యానము చేయుట – ధ్యానమునకు కావలసిన యోగ్యతలు ఎన్ని గంటలు థ్యానము చేయవలెను – ధ్యానమునకు సహాయపడునవి – ధ్యాన మునకు పనికివచ్చు ఆసనములు – ధ్యానమును నియమపూర్వకముగ అభ్యసించుట.

నాల్గవ అధ్యాయము ధ్యానము నభ్యసించుట – ధ్యానమున వాస్తవమగు విశ్రాంతి – భావన – ధ్యానయోగము – ఏకాంతవాసము, ధ్యానము – ఉత్తమోత్తమ శిఖరము నందికొనుము – ధ్యానమునందలి పొరపాటులు – ధ్యానమును గురించిన ఇరువది సూచనలు – ధ్యానమును నేర్చుకొనుటకు అభ్యాస ములు – ధ్యానస్థితి – సంయమమును అభ్యసించుట – ధ్యానప్రశ్నో త్తరి.

అయిదవ అథ్యాయము వివిధధ్యానములు – ధ్యానమందలి వివిధమార్గములు – ప్రారంభిక ధ్యానములు – గులాబిపువ్వుపై – గేదెపైన – మహత్మా గాంధి – ద్వాదశ గీతాశ్లోకములు దివ్యగీతములు సగుణధ్యానము – విరాట్ పురుషునిపై – గాయత్రిపై – నిర్గుణ ధ్యానము వేదాంతుల ధ్యానము -నిధిధ్యాసమునకు సంబంధించిన వాక్యములు – ‘ఓం’ పై ధ్యానము సోహం మహావాక్యములు అనుకూల ధ్యానము -వ్యతి రేక థ్యానము – సగుణ – నిర్గుణ ధ్యానములకు గల పోలిక ధ్యానము, కర్మ.

అరవ అథ్యాయము ధ్యాన విఘ్నములు  భూమిక – భౌతిక విఘ్న ములు – తిరుగుబోతు తనము – సాధనను ఆపుట – దేహధ్యాస – వ్యాధులు – మితి మీరిన వాద వివాదములు – పరిసరములు – దుస్సాంగత్యము-
పరనింద ఆత్మ సమర్ధ న ము – ప్రోత్సాహములు – అపరిశుద్ధమూ మరియు అహితకరమూ నగు ఆహారము
నియమ రహితమగు సాధన – ఈడ్పులు – బ్రహ్మచర్యము కొరవడుట -యమ,
నియమములు పాటించకుండుట- వదరుబోతుతనము-
గురువు యొక్క ఆవశ్యకత – మితిమీరి మెక్కుట మొదలగునవి – స్వాస్థ్య రాహిత్యము – సాంఘికతత్త్వము తంద్ర, ఆలస్యము, నిద్ర – లౌకిక సుఖములు – ఐశ్వర్యము.

ఏడవ అధ్యాయము ధ్యాన విఘ్నములు మానసిక విఘ్నములు– క్రోధము – పరనింద – ఉదాసీనత –
సంశయము – స్వప్నములు దుస్సంకల్పములు – మిధ్యాతుష్టి – భయము చంచలత్వము – ధ్యానమునందలి ఐదువిఘ్నములు – పూర్వసంస్కారము లకుగల శక్తి – విషాదము, నిరాశలోభము – ద్వేషము – అధీరత – స్వతంత్య్రస్వభావము – అసూయ- నీచప్రవృత్తి – మనోరాజ్యము – స్మృతి మానసిక సంభాషణ – మోహము _ యోగవిఘ్నములు – ఇతర విఘ్న ములు -పక్షపాతము, ఆసహనము, స్వమతాభిమానము – రజస్సు, తమస్సు – సంకల్పము లు – మూడు విఘ్నములు – తృష్ణ – వాసనలు – విక్షేపము – విషయాశక్తి.

ఎనిమిదవ అధ్యాయము ధ్యాన విఘ్నములు ఉన్నత విఘ్నములు : తీవ్ర అభిలాష, కోరిక – నైతిక ఆధ్యాత్మిక గర్వము – దంభము – కీ ర్తిప్రతిష్ఠలు – భూతగణములు – దృశ్యములు – సిద్ధులు – లయము – రసాస్వాదము – తూష్టీ ంభూతావస్థ – స్థద్ధావస్థ – అవ్యక్తము – స్వస్తివచనములు.

తొమ్మిదవ అధ్యాయము ధ్యానమునందలి అనుభవములు అనాహత నాదములు -వెలుగులు –
ధ్యానసమయమున దైవ దృశ్యము – వియోగానుభవము – హిరణ్యగర్భుడు – ఆనందానుభవము మనోగమనము _ ఆత్మదర్శనము – జ్యోతిర్మయ దర్శనము. పరిశిష్టము.