Description
Rojuko Neeti Katha
రోజుకో నీతి కథ
Pages : 350
మహానుభావుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే వారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందీ, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొందీ తెలుస్తుంది. వాటిని మన జీవితాలకు అన్వయించుకొని అపజయాలు ఎదురైనపుడు నిరాశ, నిస్పృహలు చెందకుండా విజయాలను సాధించవచ్చు.
నీతి కథల్లాంటివి చదువుతున్నప్పుడు ఆ పాత్రలన్నీ మన కళ్ళముందు కదలాడుతున్నట్టే వుండి, మన జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా నడచుకోకూడదో తెలియజేస్తాయి. పుస్తకాలు చదివే అలవాటున్న పిల్లలు వారు చదివింది తొందరగా అర్థం చేసుకోగలరు. ఈ అనుభవం తరగతిలో పాఠాలు చదువుతున్నపుడు బాగా ఉపయోగపడుతుంది. అలాంటి పిల్లలే ఫస్ట్ ర్యాంకులో వుంటారు. మిగిలిన పిల్లలకంటే మీ పిల్లల్ని ముందు వరుసలో నిలబెడుతుంది. పుస్తకాలు చదవడంవల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది, కొత్త పదాలు తెలుస్తాయి. చక్కని భాష వొంటబట్టి మంచి శైలి అబ్బుతుంది. పుస్తకాలు బాగా చదివేవారు రిటైర్ అయినా జీవితంలో రిటైర్ కాకుండా ఉత్సాహంగా, ఉల్లాసంగా జీవిస్తారు.
ఈ పుస్తకం మీరు రోజుకో గంట చదివితే పదిరోజుల్లో పూర్తి చేయవచ్చు. అయితే నేటి కాలానికి అనుగుణంగా ఇందులో 365/366 నీతి కథల్ని ”రోజుకో నీతి కథ” పేరుతో నేటి పిల్లలకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులకు అందిస్తున్నాం.
ఇందులో పురాణాల్లోని నీతి కథలు, ఈసఫ్ నీతి కథలు లాంటివి, టాల్‌స్టాయ్ పిల్లల కథలు లాంటివి, రష్యన్, ఆఫ్రికన్ జానపద కథలు, తెలుగు వారి జానపద కథలు వున్నాయి. ఇవి చదివేవారికి నీతి, వివేకం, విజ్ఞానం, వినోదం కలిగించే కథలు. పేజీలు : 350