Swami Vivekananda Samagra Jeevita Gaatha

100.00

స్వామి వివేకానంద (రెండు సంపుటములు)
Author : Swami Jnanadananda
Pages : 1108


మరిన్ని పుస్తకాలకై

Categories: ,


Share Now

స్వామి వివేకానంద (రెండు సంపుటములు)
Author : Swami Jnanadananda
Pages : 1108

సమగ్ర, సప్రామాణిక జీవితగాథ

ఎవరి రూపం చూస్తే నిరాశానిస్పృహలు దూరమై ధైర్యోత్సాహాలు జనిస్తాయో, ఎవరి వాక్యాలు చదివితే దేహంలో విద్యుత్ ప్రకంపనాలు కలుగుతాయో, ఎవరి బోధలు, సోదర మానవుల పట్ల ప్రేమను, సేవాభావాన్ని ఉద్భవింపజేస్తాయో దేశభక్తిని ప్రజ్వలింపజేస్తాయో అట్టి మహనీయుడైన స్వామి వివేకానంద జీవిత చరిత్రను ఈ రెండు సంపుటాలలో సవిస్తరంగా వివరించడం జరిగింది. ఆ వివేక ప్రవాహంలో మునిగి ఆనందాన్ని పొందడానికి ఆ చరితార్థుని చరిత్ర చదివి తీరవలసిందే!

———————————————————————————————————————————–

సుఖదుఃఖాలు
జీవితంలో మనం సుఖం కావాలని కోరుకుంటాం. దుఃఖం అక్కర్లేదనుకుంటాం. జీవన గమనమంతా సుఖదుఃఖాలు రెండూ వస్తూపోతూ ఉంటాయి. సముద్రం ముందు మనం నిలుచుని చూస్తున్నప్పుడు ఒక కెరటం ముందుకు వస్తుంది. మరో కెరటం వెనక్కిపడిపోతుంది. ఇదంతా సముద్రంలో జరుగుతుంది. సముద్రం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. జీవితమూ అంతే.

దుఃఖం బాధాకరం కనుక దాన్ని తప్పించుకోవాలని అందరూ చూస్తారు. దుఃఖ నివారణ మార్గం చెప్పాడు బుద్ధుడు. అదే అష్టాంగయోగ మార్గం. మధ్యేమార్గంలో జీవితం గడపాలి. దేనిలోనూ అతి అన్నది పనికి రాదు. సమత్వమే యోగంగా తెలుసుకోవాలి.

దుఃఖం లేని జీవితం ఎవరికైనా సాధ్యమా? ప్రకృతిలో అటువంటి ఏర్పాటులేదు. సుఖం కలగడానికి ఏది కారణమవుతుందో, దుఃఖం కలగడానికీ అదే హేతువవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు.
మనసుకు నచ్చిన వారికోసం మనం చేసే నిరీక్షణలో ఆనందం ఉంటుంది. అదే- తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షలా భావిస్తూ ఎదురుచూడటం దుఃఖాన్ని కలిగిస్తుంది.

సీతాన్వేషణ సమయంలో రాముడితో కలిసి పనిచేయడం వానరసేనలో అందరికీ ఆనందం కలిగించింది. అదే సమయంలో అటువైపు రావణాసురుడి కోసం ఇష్టం లేక పోయినా తప్పనిసరి తద్దినంలా భావించి యుద్ధానికి దిగిన మహావీరులు దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయారు. మనం ఆశ్రయించిన వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి సుఖదుఃఖానుభవాలు కలుగుతుంటాయి.

అన్ని సుఖాల కంటే ఆత్మసుఖమే గొప్పదంటారు అరుణాచల రమణులు. సుఖదుఃఖాలు తాత్కాలికం అని తెలుస్తుంది సత్యం అనుభూతిలోకి వస్తే- అంటారు స్వామి వివేకానంద.
సుఖం మన ఇంటిపేరు కాదు. దుఃఖం మన వంశ గోత్రమూ కాదు. ఏ నర మానవుడు వీటికి తాను అతీతం కాదని తెలుసుకొని, జీవితాన్ని జీవిస్తాడో అతడే గొప్పమనిషి!

మనం సుఖాన్ని అర్థం చేసుకోవడంలో తొందరపడతాం. అలాగే దుఃఖాన్ని అపార్థం చేసుకోవడంలో ముందుంటాం. సుఖదుఃఖాల గురించి పూర్తిగా తెలుసుకొని పుట్టిన ప్రహ్లాదుడిలా మనం పుట్టలేదు. అందరూ కారణజన్ములు కాలేరు.

సుఖానికి ఎలా సంతోషిస్తావో, దుఃఖానికి అలాగే దుఃఖిస్తూ ఉండటం సహజం. ఎక్కువ సంతోషం పనికిరాదు. ఎక్కువ బాధా పనికిరాదు. రెండూ ఉండాలి. రెండూ ఉంటాయి. ఏది ఎప్పుడు ఉండాలో, దేనికి ఏ ప్రయోజనం ఉందో జీవితమే నిర్ణయిస్తుంది. ఆనంద బాష్పాలు రాల్చే కన్నులే దుఃఖాశ్రువుల్నీ కారుస్తాయి. రెండింటిలో మానసిక సమతుల్యతను కలిగించే రసాయనాలు స్రవిస్తాయి. అవి శరీరానికి అవసరమని పరిశోధకులు అంటున్నారు.
మోడువారిన చెట్టే చిగురిస్తుంది. ఎండిపోయిన నదే తిరిగి ప్రవహిస్తుంది. బీటలు వారిన భూమి తిరిగి సారవంతమైన పంటలు పండిస్తుంది. ఆరు రుతువుల్లో ఆకులు రాల్చే శిశిరం ఒకటి.

బాధ కలిగితే మనిషి గాలిలో చిగురుటాకులా వణికిపోతాడు. ఆనందం కలిగినప్పుడు తనను మించినవాడు లేనట్లుగా భావిస్తాడు. ఈ రెండింటినీ అధిగమించాలి.

ఒకే నాణేనికి బొమ్మాబొరుసుల వంటివి సుఖదుఃఖాలు. ఒకసారి సుఖం అనే దిండు మీద నిద్రిస్తే, మరోసారి దుఃఖం అనే దిండుమీద నిద్రిస్తాం అంటాడు ప్రముఖ తాత్విక కవి ఖలీల్‌ జిబ్రాన్‌. శీతోష్ణ, సుఖదుఃఖాలను రాగద్వేషాలను ఎవరు సమదృష్టితో చూస్తాడో అతడే స్థితప్రజ్ఞుడు అంటోంది భగవద్గీత.

సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా చూడగలిగే స్థితి సరైన జ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. కుటుంబంలోని సభ్యుల్లాగా అన్ని భావాలతోపాటు మానవ జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. అవి కావడిలో కుండలని వేదాంతులు చెప్పారు. జీవితానుభవంవల్ల వాటిని జీర్ణించుకునే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానమే మనల్ని సుఖదుఃఖాలకు అతీతం చేస్తుంది!

– ఆనందసాయి స్వామి

#Sri Ramakrishna Math