Description
Sangeeta Swaralu
సంగీత స్వరాలు
వినాడానికి ఇంపుగా ఉండే ధ్వనులను శ్రావ్యధ్వనులు అంటారని, వినడానికి కర్ణకఠోరంగా ఉండే ధ్వనులను చప్పుళ్ళు అంటారని మనకు అనుభవంలో తెలిసిన విషయమే! అసలు ధ్వని అంటే ఏమిటి? ఎలా పుడుతుంది? అని ఆలోచిస్తే…ఏదైనా వస్తువు మీద కంపనం కలగజేస్తే వచ్చేది ధ్వని.
అంటే… ఏ వస్తువు కంపిస్తే దానికి చెందే ధ్వని ఏర్పడుతుంది. ఇలా కంపిస్తున్నప్పుడు, ఆ వస్తువు చుట్టూ గల గాలిలో అలలు ఏర్పడుతాయి. శాస్త్రరీత్యా వీటిని ‘ధ్వని తరంగాలు’ అంటారు. (సౌండ్ వేవ్స్)
ఇక్కడ మరో విషక్ష్మీం కూడా ప్రస్తావించాలి. సదరు వస్తువు ఒక సెకండ్‌లో ఎన్నిసార్లు కంపిస్తోందో – ఆ కంపనాల సంఖ్యని ఆ వస్తువు ఫ్రీక్వెన్సీ (పౌన:పున్యం) అంటారు. ఉదాహరణకు ఒక తీగ మీటితే (కంపించేలా చేస్తే) ఆ తీగ సెకండ్‌కు 200 సార్లు కంపించింది అనుకుందాం! అప్పుడు తీగ ఫ్రీక్వెన్సీ 200ఎఫ్ అని చెప్పాలి.
ఈ విధంగా కాకుండా, ఫ్రీక్వెన్సీ తరచుగా మారిపోతుంటే, శ్రావ్యత లోపించి చప్పుళ్ళు వినిపిస్తాయి. అందుకే అవి ‘కర్ణకఠోరం’గా వుంటాయంటారు. చెవికింపుగా లేని ఇలాంటి శబ్దాల మోత వల్ల – మన హృదయాలకు హాయి కలగదు సరిగదా…అంతవరకు ఉన్న హాయి కూడా ఆవిరైపోయి చిరాకు కలగడం సహజం.