Sri Ramakoti (Big Box size)

శ్రీ రామకోటి
(పెద్ద గడితో)

144.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

శ్రీ రామకోటి

రామకోటి రాస్తే ఫలితం ఏమిటి?

              ఎలా రాయాలి..? పద్ధతులేంటి?
రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. మంచి రోజు చూసుకుని రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి. రామకోటి రాసేందుకు కలం విడిగా పెట్టుకోవడం మంచిది. రామకోటి రాసేటప్పుడు అనవసర చర్చలు, ఇతర వ్యాపకాలు ఉండకూడదు. ఏకాంత ప్రదేశం ఎంచుకోవాలి.
రాసే పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో పూజించాలి. శ్రీ రామ అష్టోత్తరశతనామావళి చదివి రాయం ప్రారంభించాలి. లక్ష నామాలు రాయటం పూర్తయిన ప్రతిసారీ శక్తి కొలది పూజ, నివేదన చేసి ఆ ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి. అలాగే కోటి నామాలు రాసిన తర్వాత కూడా చేయాలి.
అనుకోని కారణాల ద్వారా రాయడం ఆపాల్సి వస్తే.. సరి సంఖ్య వరకు రాసి పుస్తకం మూసి నమస్కరించి వెళ్లాలి. పని పూర్తికాగానే కాళ్ళు, చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయాలి. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామయ్యకు లేదా ఏదైనా రామాలయంలో అప్పగించాలి. అదీ వీలుకాకుంటే ప్రవహించే నదిలో వదిలిపెట్టాలని పండితులు అంటున్నారు.