Description
యోగా – మండే టు సండే
Author: K. Manikyeswara Rao
Pages: 104
యోగ అనే పదానికి అర్థం ”కలయిక” దీనిని ఆధ్యాత్మిక భావంతో ఆలోచించినపుడు జీవాత్మ,పరమాత్మతో కలయిక చెందడం. దీనినే సాధారణ భావంలో చూస్తే శరీరం, మనసు కలయికగా మనం అర్ధం చెప్పుకోవచ్చు. ఈ కలయికని మనం ఆసనాలు, ప్రాణాయామాలు, బంధాలు, ముద్రలు, షట్కర్మలు మరియు ధ్యానము అనే ప్రక్రియలు ద్వారా సాధించుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు యోగ అనేది నిత్యజీవితంలో ఫిట్‌నెస్ కోసం చేసే కార్యక్రమంగా పేరుపొందింది. నేటి జీవితంలో మనం రోజు ఎదుర్కొనేది ముఖ్యంగా స్ట్రెస్. దీనికి సమాధానం యోగతోనే సాధ్యం. యోగ ఆసనాల వలన రోజువారి జీవితంలోని శారీరక శ్రమ వలన శరీర కణాల్లో పేర్కొన్న వివిధరకాల టాక్సిన్స్, వ్యర్ధపదార్థాలు బైటకు పంపబడతాయి. అదేవిధంగా వివిధ ప్రాణాయామాలు, రిలాక్సేషన్ విధానాలు మీ ఆలోచనా విధానాల్లో మార్పుని తీసుకురావడమే కాకుండా మానసికమైన స్ట్రెస్‌తగ్గించి రోజువారిజీవితంలో స్పష్టతతీసుకొని రావడంతో తోడ్పడతాయి.