Description
రఘువంశ మహాకావ్యము | Raghuvamsa Mahakavyamu
మహాకవి కాళిదాసు | Mahakavi Kalidasu
మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో…… రఘువంశం (సంస్కృతం: रघुवंश ) మహాకవి కాళిదాసు రాసిన సంస్కృత మహాకావ్యం. ఈ గ్రంథ కూర్పుకు ఖచ్చితమైన తేదీ తెలియకపోయినా, కవి కాలాదుల ఆధారంగా 5 వ శతాబ్దంలో వ్రాసినట్లు భావించబడుతుంది. ఈ గ్రంథంలో 19 సర్గలలో రఘు రాజవంశానికి సంబంధించిన కథలు, దిలీపుని కుటుంబం, అగ్నివర్ణుని వరకు అతని వారసుల గూర్చి వివరించబడినది. వీరిలో రఘుమహరాజు, దశరథ మహారాజు, రాముడు ఉన్నారు. ఈ రచనపై 10 వ శతాబ్దపు కాశ్మీరీ పండితుడు వల్లభదేవుడు తొలి వ్యాఖ్యానం వ్రాసాడు. మల్లినాథుడు రాసిన సంజీవని అత్యంత ప్రాచుర్యం పొందిన, విస్తృతంగా లభించే వ్యాఖ్యానం