Kukkuta Sastram

కుక్కుట శాస్త్రం 
శ్రీ పాలాట్ల వెంకట తాతయ్యనాయుడు
కూర్పు – శ్రీ పుచ్చా శ్రీనివాస రావు

63.00

Share Now

Description

కుక్కుట శాస్త్రం 
శ్రీ పాలాట్ల వెంకట తాతయ్యనాయుడు
కూర్పు – శ్రీ పుచ్చా శ్రీనివాస రావు
————————————————————
కోడిపుంజుల రకాలు
కాకినెమలి.పందెంకోడి
కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. సంస్కృత భాషలో కుక్కుటము అనగా కోడిపుంజు. ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్ని సంక్రాంతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ, కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. పందెంలోకి వెళ్ళే కోడిపుంజుని పందెం కోడి అని అంటారు. కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు అనేది తెలియదు కాని, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం తర్వాత ప్రాచుర్యం పొందింది. శతాబ్దాల కాలం నుండి ఆంధ్ర క్షత్రియులు (రాజులు) తమ పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్తాన్ని ఆచరిస్తూ కోడి పందాలను నిర్వహించేవారు. చట్టబద్దం కాకపోయినా ఈ పందాలు ఉభయ గోదావరి జిల్లాలలో ఇంకా నిర్వహించబడుతున్నాయి.