Bulli Bala Siksha

25.00

బుల్లి బాలశిక్ష

Author: N.V.Acharya
Pages: 56

మరిన్ని పుస్తకాలకై

Category:

బుల్లి బాలశిక్ష

Author: N.V.Acharya
Pages: 56
మాతా ప్రథమ గురు!
అలవికాని అనురాగం, వెలకట్టలేని ప్రేమభావం, హద్దుల్లేని క్షమాశీలం… వెరసి నవజాత శిశువుకు తొలిదైవం- అమ్మ. మనిషి పుట్టుక నుంచి జీవనపర్యంతం అతడు వేసే ప్రతి అడుగు వెనక ఆమె పాత్ర అత్యంత కీలకం. కోమలత, త్యాగం, సేవ, సమర్పణత, సహనశీలత, శ్రద్ధలకు మారుపేరైన ఆమె తన ఆలనతో, పాలనతో అలవోకగా బిడ్డను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన మహాశిల్పి. శైశవ, బాల్యాల్లో చిన్నారులకు తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ఆ దశలో అందే తల్లిపాలన, ప్రేరణలే వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి అయిదు సంవత్సరాలూ చాలా విలువైనవంటారు మనస్తత్వవేత్తలు.
   తల్లి ఆలోచనలు, సంస్కారాల ప్రభావం గర్భస్థదశ నుంచే శిశువుపై పడుతుందని పురాణగాథలు చాటుతున్నాయి. లీలాదేవి నారదుడి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని వింటున్నప్పుడు ఆ జ్ఞాన ప్రభావం గర్భంలో ఉన్న ప్రహ్లాదుడిపై పడింది. తండ్రి హిరణ్యకశిపుడు అసురస్వభావం కలిగినవాడైనప్పటికీ ప్రహ్లాదుడి సంస్కారాలు శ్రేష్ఠంగా ఉండటానికి ఇదే కారణం.
    ఆలోచనాశక్తి, వాక్‌శక్తి, బౌద్ధికశక్తుల మూలమైన ప్రతి తల్లి పిల్లల శరీర వికాసానికి మాత్రమేగాక వారి ఆత్మోన్నతికీ కృషిచేసే విధంగా వారితో ఎక్కువ సమయం గడపాలి. పెద్దలు పిల్లలకు చెప్పేదొకటి, తాము చేసేది మరొకటిగా ఉంటే- పిల్లలూ అదే నేర్చుకుంటారు. విలువలనేవి చెప్పి నేర్పించేవి కావు. పెద్దల ఆచరణను చూసి పిన్నలు తమకు తామే అలవరచుకుంటారు. ప్రతి తల్లీ ‘నేను పిల్లల సంస్కార నిర్మాత’ను అని గుర్తుంచుకుని- ఆధ్యాత్మిక మానవీయ విలువలను మొదట తాను అలవరచుకుని కుటుంబంలోనూ అటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలి.
   విశ్వంలో అన్నింటికంటే గొప్ప బడి- అమ్మఒడి. ధ్రువుడు, శంకరాచార్యుడు, స్వామీ వివేకానందుడు, ఛత్రపతి శివాజీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌, మహాత్మాగాంధీ వంటి మహాపురుషులెందరో తొలి ధర్మపాఠాలు నేర్చుకున్నది తల్లిఒడిలోనే. వివేకానందుడి వద్దకు ఒక మహిళ వచ్చి ‘స్వామీ!నాబిడ్డనుకూడా మీలాగే వివేకవంతుడిగాతయారు చేయాలనుకుంటున్నాను. మీరే బడిలో చదివారో చెబితే మా అబ్బాయిని కూడా అక్కడే చదివించాలనుకుంటున్నాను’ అన్నదట. దానికి స్వామీజీ నవ్వుతూ- అమ్మా! ఇప్పుడు ఆ బడి లేదు. ఆ ‘బడి’ నా కన్నతల్లి, ఇప్పుడు ఆవిడ లేరు’ అని చెప్పారట.
     భౌతిక విద్యలు జీవనోపాధికి, ఆర్థిక వికాసానికే పరిమితం. ఆధ్యాత్మిక విలువల ఆధారిత విద్యతోనే జీవన ఔన్నత్యం పెరిగి ఆదర్శవంతమైనపౌరుల నిర్మాణం సాధ్యపడుతుంది. ఆధునిక విద్య పేరుతో అంతర్జాలం, వాట్సాప్‌లలో పాఠాలు చదువుకుంటున్న నేటి రోజుల్లో ర్యాంకులకు మార్కులకే పరిమితమవుతున్నాయి పసిహృదయాలు. పిల్లలు, విలువలు వికాసం లేని అనాగరికులుగా, సమస్యలను సామరస్యంగా ఎదుర్కోలేని అసమర్థులుగా మారడం వెనక ఎవరి పాత్ర ఎంతనేది ఎవరికి వారే ఆలోచించుకోవాల్సిన తరుణమిది. బాలల్లో ఉండే అమోఘమైన కల్పనాశక్తి అనుచిత కార్యాల్లో నిర్వీర్యం కాకూడదు. అది వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఆలంబన కావాలి. ప్రతి తల్లి బాల్యం నుంచీ మానవతా విలువల్ని పౌరాణిక గాథల రూపంలో తన బిడ్డలకు తెలియజేయాలి. పిల్లల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దే అద్భుత శక్తి వాటిలో దాగి ఉంది.
   కన్నబిడ్డల్ని క్రమశిక్షణతో పెంచి ఆధునికతకు, ఆధ్యాత్మికతకు జీవితంలో స్థానం కల్పించి, దేశానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతలను తీసుకున్నప్పుడే ‘మాతా ప్రథమ గురు’ అన్న మాటకు సార్థకత చేకూరుతుంది. ‘వందే మాతరం’ అన్న నినాదం విశ్వవిఖ్యాతమవుతుంది.    – బ్రహ్మకుమారి వాణి