Veyi Padagalu

వేయి పడగలు
– విశ్వనాధ సత్యనారాయణ
Author : Viswanadha Satyanarayana

888.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

వేయి పడగలు
– విశ్వనాధ సత్యనారాయణ
Author : Viswanadha Satyanarayana

పంతోమ్మిదీ ఇరవయ్యో శతాబ్దాల నాటి సంధి చరిత్ర ….. అన్నారు కొందరు 

భారతీయ విజ్ఞాన సర్వస్వం ……. అన్నారు మరికొందరు

తెలుగు వారి మహాభారతం ……. అన్నారు ఇంకొందరు

నేటి వాతావరణ కాలుష్యాది అనేక దుష్పరిణామాలను

ఆనాడే హెచ్చరించిన వైజ్ఞానిక భవిష్య పురాణం …. అంటున్నారు ఎందరో !!!

ఎందరైనా అన్నైనా అనవచ్చు కానీ…

ప్రధానంగా స్త్రీ పురుషుల సంబంధాన్ని

సహస్ర ముఖాలుగా చూపించిన

అపూర్వ నవలా కావ్యం

వేయిపడగలు 

         ఈ నవలను విశ్వనాధ సత్యనారాయణ గారు తాను ఆశువుగా చెపుతూ ఉండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాశారు. 1934 లో సరిగ్గా 29 రోజుల్లో 999 అరటావుల మీద వ్రాశారు. ఆనాడు ఆంధ్రవిశ్వ విద్యాలయము వారు ప్రకటించిన పోటికి వ్రాయబడి బహుమతి నందుకున్నది.  

           ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా ఉన్నత పదవులనధిరోహించిన బహుబాషా కోవిదులు శ్రీ. పి.వి నరసింహారావు గారు, 1968 ప్రాంతాలలో యీ నవలను హిందిభాషలోనికి అనువదించారు. ఆ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తరువాత ఈ నవల వివిధ ప్రముఖుల చేత, వివిధ భాషలలో  అనువదించబడినది. వారు రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్ష మహకావ్యానికి 1970 లో భారతీయ జ్ఞానపీట పురస్కారం లభించింది. కళాప్రపూర్ణ, డాక్టరేట్ల వంటివి ఎన్నో బిరుదులు వారిని వరించినా, తెలుగు పాటకలోకానికి వారు కవిసామ్రాట్టు గానే సుప్రసిద్ధులు.

ఈ నవలలో అరుంధతీ,ధర్మారావులు నాయికానాయకలు. ఇందులో కొన్ని పాత్రాలు మానుష ప్రపంచాన్ని దాటిపోతాయి. కథాస్థలమైన సుబ్బన్న పేట ఒక గ్రామం. అది కాలక్రమంలో పాశ్చాత్యపు పెను ప్రభావాలతో ఆధునిక నాగరికతా పోకడలకు పోయి, ఎట్లా పలు దుష్పరిణామాలకు లోనైందోనన్నది “వేయిపడగలు” ఇతివృత్తం.