Description
రహస్య కుక్కుట శాస్త్రం
Author : Lolla Ram Chandrarao (Ramji)
కోడిపందాల్లో జ్యోతిష్యం..
విజయం కోసం నక్షత్రాలు,
వారాలు కూడా చూస్తారట?
సంక్రాంతికి కోడిపందాలు ఉండాల్సిందే. అలాంటి కోడిపందాలకు జ్యోతిష్య శాస్త్రానికి లింకుందట. కోడిపందాలు అంటే ఏవో రెండు పుంజులు కాసేపు ఫైటింగ్ చేసుకోవడం వరకే అందరికీ తెలుసు. అయితే పందెం కోసం ప్రత్యేకంగా జాతి పుంజును పెంచడం నుంచి.. పందెం రోజు నక్షత్రం? వారం ఏమిటి? అనేవి కూడా చూసుకుంటున్నారట. తాము పెంచుతున్న జాతి పుంజుకు ఆ రోజు నక్షత్రబలం, వార బలం బాగున్నాయా అనేవి కూడా చూసుకుంటారట. విజయం తమనే వరించాలని కోరుకుంటున్న వారు కుక్కుట శాస్త్రంలో పేర్కొన్న అంశాలను సెంటిమెంట్‌గా తీసుకుంటారట.
శాస్త్రం ప్రకారం నక్షత్రాలు చూసుకుని ఆ ప్రకారం కోడి పుంజులను ప్రత్యర్థి పుంజు మీదకి పంపి కాలు దువ్విస్తారు. అశ్వని, భరణి మొదలుగా ఉన్న 27 నక్షత్రాలూ మానవులపై ప్రభావం చూపుతాయన్నది అందరికీ తెలిసిందే. అదేవిధంగా వివిధ జాతుల పుంజులపై కూడా అవి ప్రభావం చూపుతాయని పందెంరాయుళ్లలో చాలామంది నమ్ముతారట.
వారి నమ్మకం ప్రకారం అశ్వనీ నక్షత్రం నెమలి, కాకి, గౌడు రకం పుంజులకు మంచిదైతే.. ఆరోజున ప్రత్యర్థులుగా డేగ, కోడి, పింగళి జాతి పుంజులు వస్తే వాటి సంగతి అంతేనన్నమాట. అలాగే భరణి నక్షత్రం ఎర్రకాకి పుంజులకు బెస్ట్ అట. వారాల్లో ఆదివారం పింగళి జాతి పుంజుకు పనికిరాదట. అదే కృష్ణపక్షం ఆదివారమైతే.. కాకి పుంజుకు మంచిది కాదట. ఇక ఉత్తరం వైపు పందానికి వెళ్లే వారికి ఆది, శుక్రవారాలు మంచివట. ఇవే కాదండోయ్.. కోడిపందాలకు పందెం కాసే పందెంరాయుళ్లు, కోళ్ళ యజమానులకు చాలా సెంటిమెంట్లు వున్నాయట.