Description
ంస్కృత వాఙ్మయంలో పురాణాలకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సామాన్యులు అందుకోలేని వేదవిజ్ఞానాన్ని సులభంగా అందించేవే పురాణాలు.
సాధారణంగా అందరూ పురాణాల గురించే మాట్లాడతారు. పుస్తకాలు రాస్తారు. కానీ ఉపపురాణాల గురించి ఎవరికీ తెలియదు. పురాణాలను సృష్టించిన వేదవ్యాసమహర్షే ఉపపురాణాల్నీ సృష్టించాడు. వేదాలకు సారభూతమైన రీతిలో లోకానికి అందించాడు.
పేరుకి ఉపపురాణాలు అన్నంత మాత్రాన వీటికి ఏ కొరతా లేదు. ప్రాజ్ఞులు మహాపురాణాలకు ఎంత గౌరవం ఇచ్చారో ఉపపురాణాలకీ అంతే గౌరవం ఇచ్చారు. ధర్మశాస్త్ర గ్రంథ వ్యాఖ్యానాలలో ప్రామాణికంగా తీసుకున్నారు. మహాపురాణాలలో లేని ఎన్నో ప్రత్యేకమైన అంశాలు
ఉపపురాణాలలో చోటుచేసుకున్నాయి. మహాపురాణాలతో సమాన ప్రతిపత్తిని పొందాయి.
అలాంటి ఉపపురాణాల గురించి సంగ్రహసుందరంగా
తెలుగులో వెలుగు చూసిన తొలి గ్రంథం ఈ ఉపపురాణ దర్శనం.
ఇందులో.. వైష్ణవ, శైవ, సౌర, శాక్తేయ, గాణపత్య,
ధర్మశాస్త్రాలకు సంబంధించిన ఉపపురాణాలను, వాటిలోని అనేక ఆసక్తికరమైన విషయాలను అందించే ఈ గ్రంథం పురాణ వాఙ్మయశాఖలో
ఉపపురాణాలు పద్దెనిమిది సంఖ్యలో ఉన్నాయి, ఆ పద్దెనిమిది జాబితాలో ఏ కానానికల్ శీర్షికలు ఉన్నాయి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి .
వాటిలో ఉన్నాయి –
- సనత్-కుమార
- నరసింహ
- బృహన్-నారదియ
- శివ-రహస్య
- దుర్వాస
- కపిల
- వామన
- భార్గవ
- వరుణుడు
- కాళికా
- సాంబ
- నంది
- సూర్య
- పరాశర
- వసిష్ఠ
- వినాయకుడు
- ముద్గల
- హంస
కొన్ని మాత్రమే విమర్శనాత్మకంగా సవరించబడ్డాయి.