Srimad Bhagavata Kathalu

శ్రీ మద్ భాగవత కథలు

495.00

Share Now

Description

Srimad Bhagavata Kathalu
శ్రీ మద్ భాగవత కథలు 

విజయదశమి పర్వదినాన ఆదివారం ఉదయం జూమ్ అంతర్జాల వేదికగా దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ప్రచురించి నిర్వహించిన ప్రముఖ రచయిత,ముఖ్యమంత్రి ప్రధాన ప్రజాసంబంధాల అధికారి శ్రీవనం జ్వాలా నరసింహారావు గారి రచన శ్రీ మధ్భాగవత కథలు గ్రంధాన్ని మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు.
సరళంగా, క్లుప్త సౌందర్యంగా సమకాలీన సమాజానికి శ్రీమద్భాగవతాన్ని కథలుగా శ్రీ వనం జ్వాలా నరసింహారావు అందించారని మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రశంసించారు. ఏ పురాణం అయినా ఇతిహాసం అయినా సంక్షిప్తం చేసి రాయడం చాలా కష్టం అయితే జ్వాలా గారి శ్రీమద్భాగవత కథలు మూలానికి అద్దం పట్టే విధంగా అందరికీ అర్థమయ్యేలా రాశారని అన్నారు . ఈ గ్రంథం పండితుల నుంచి పామరుల దాకా ప్రతి ఒక్కరికి చదవటానికి ఆసక్తికరంగా పారాయణ గ్రంథంగా ఉంటుందన్నారు. పోతన భాగవతం లోని ముఖ్యమైన పద్యాలను అన్నిటినీ ఈ గ్రంథంలో ఉటంకించి కథారచన సాధించారని పేర్కొన్నారు. రామాయణ భారత భాగవత గ్రంథాలు ఇంట్లో ఉంచుకోవడమే కాదు వాటిని పఠించి, అనునయించి వాటిలోని ధర్మాలను ఆచరించాలని అప్పుడే ఆ గ్రంథ పఠనానికి సార్థకత ఉంటుందన్నారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు.
ఇంకా ఈ గ్రంధావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ధార్మిక సాహిత్యం ఆధ్యాత్మికవేత్తలు వనం జ్వాలా నరసింహారావు ధార్మిక రచనా వ్యాసంగాన్ని ప్రస్తుతించారు. ఇంతకుముందు రామాయణ గ్రంథాలను ఇప్పుడు శ్రీ మద్భాగవత కథలను అందించడం సంతోషకరమని భవిష్యత్తులో మహాభారతాన్ని కూడా సరళంగా అందించాలని సూచించారు. కేంద్ర సమాచార పూర్వ కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్, ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్ వి సుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్ పూర్వ కార్యదర్శి డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు, ప్రసిద్ధ సినీ నటులు రచయిత శ్రీ తనికెళ్ళ భరణి, రిటైర్డ్ పోలీస్ అధికారి శ్రీ రావులపాటి సీతారాంరావు, దూరదర్శన్ పూర్వ సంచాలకులు శ్రీ ఆర్ వి వి కృష్ణారావు, సీనియర్ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకులు వెంకట రమణ శర్మ అధ్యక్షత వహించారు.