Description
సూక్తిరత్నాలు
1)తల్లితండ్రుల తమ సంతానానికి అందచిన వాటికి ప్రతిఫలం యీ సృష్టిలోనే లేదు.-వాల్మికి
2)సంతృప్తి అనే వంతెన విరిగిపోయిందంటే యిక, మనిషి జీవితంలో కోరికల ప్రవాహానికి అడ్డూ, ఆపూవుండవు. -ప్రేమచంద్
౩)మనుషుల్లో వైరానికి అయిదు కారణాలుంటాయి -స్త్రీలు, ఆస్తీపాస్తులు, కఠోరమైన వాక్కులు,కులమత ద్వేషాలు, ఎప్పుడో తెలిసో తెలియకో చేసిన అపరాధాలు. -మహాభారతం
4)మనిషి జీవితంలో అన్నిటికన్నా ముక్యమైన విషయ౦ ప్రతి మనిషి తన పని తాను నిజాయితీతో వ్యవాహరించగలగడం . -షేక్ స్పియర్
5)మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా, వారి గురించి పూర్తిగా తెలిసేదాకా, ప్రజలు వారు చెప్పేది ఒక్క ముక్కయినా వినరు . -వినోబాభావే
6)అందమైన వస్తువు నిరంతరం ఆనందాలు జలపాతాలని అందిస్తూ వుంటుంది.అందం తాలూకు ఆనందం నానాటికీ ఎదుగుతుండే జీవన మాధురి.అది ఎన్నటికీ శూన్యంగా వాడిపోదు.
-జాన్ కీట్స్
7)ఈ ప్రపంచం మనతో చిత్రాల ద్వారా మాట్లాడుతుంది……అప్పుడు మన ఆత్మ సంగీతం ద్వారా సమాదానాలిస్తుంది. -రవీంద్రనాథ్ ఠాగూర్
8)ప్రపంచంలో ఎన్నో రకాల యుద్దాలుంటాయి.అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నిటినీ మించిన మహాస౦గ్రామంలాంటిది. -స్వామి శివానందుడు
9)మంచి మనుషుల మనసులు వెన్నెలా వుంటాయి.-తులసీదాసు
10)వైరం అంతమయ్యేది మృత్యువుతోనే. -వాల్మీకి
11)ఆలోచనల యుద్దంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. -జార్జి బెర్నార్డ్ షా
12)మనం మంచివారితో సాంగత్యం చేస్తూ జీవనం సాగిస్తుంటే, చెడు గుణాలు సైతం మంచి గుణాలుగా పరిగణి౦చబడుతుంటాయి. గొల్ల వారింట్లో కూర్చుని, కల్లు తాగినా, పాలే తాగామనుకుంటుంది లోకం. -విదురుడు
13)సరసహృదయం వున్నవారు సాధారణంగా మృదువైన స్వభావం కలిగి వుంటారు. -కాళిదాసు
14)అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం వుంటుంది.-ప్రేంచంద్
15)కలసిమెలసి జీవించే మానవాళి మనుగడ వికాసంలోని సహజపరిణామమే – అంతర్జాతీయ స్థాయిలో సైతం దశదిశల నుంచి లభించే సంపూర్ణ సహకారం.-ఇందిరా గాంధీ
16)మనిషికి తన జీవితంలో సత్యం పలకాలి…..ప్రియమైన మాటలు పలకాలి.అయితే ప్రియంకానప్పుడు, ఆ సత్యాన్ని పలకకుండా ఉండడమే శ్రేయస్కరం. -మనుస్క్రతి
17)సౌందర్యమే సత్యం….. సత్యమే సౌందర్యం. -జాన్ క్రిట్స్
18)సత్యమార్గం ఎంతో సులభం…… సుఖ ప్రయాణానికి ఎంతో యోగ్యం.-ఋగ్వేదం
19)భగవంతుడి చల్లనిచూపు లభించకపోతే, మంచి వారితో మైత్ర్హీబంధం అసలే దొరకదు.-తులసిదాసు
20)మన వాకిట నిలిచినా మంచివారినీ, మహాపురుషులనీ దర్శించుకుంటే చాలు, పుణ్యక్షత్రల్లో చేసిన కోట్లాది తీర్థస్నానాలకి మించిన ఫలం లభిస్తుంది.-సూరాదాసు
21)బంగారంలోని ప్రతి అణువు ఎంతోవిలువైనది. గడిచే కాలంలోని ఒక్కోక్య ఘడియ సైతం అంతే! -జె.మేసన్
22)హృదయం నిండా పరులపట్లసానుభూతి పొంగి పొరలే మనిషికే, ఇతరులని విమర్శించే అధికారం వుంటుంది.-అబ్రహం లింకన్
23)వివేకానికి మారుపేరుగా నిలిచిపోయే హంసపక్షి స్మశానంలో వుండదు. అలాగే, మంచివారు చెడ్డవారితో కలసి మెలసి వుండలేరు. -కౌటిల్యుడు
24)ప్రేమగుణం బాగా పెరిగితే, లభించే సంపద పవిత్రత. -రవీంద్రనాథ్ ఠాగూర్
25) మనిషికి మంచి మనసుండాలే గాని, నానావిదాల సంపదలూ వాటంతట అవే కూరుస్తుంటాయి. -తులసీదాస్
26)కలసి మెలసి జీవించడానికి బదులుగా చెయ్యగలిగింది- పరస్పర సంపూర్ణ వినాసమే!
-జవహర్లాల్ నెహ్రు
27)మనసునిండా నిజాయితీ పెల్లుబుకుతుండాలే గాని, అటువంటి మనిషి తక్కిన ఎంతోమందికన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు.
-పండిట్ మోతీలాల్ నెహ్రు
28)మన పూర్వీకులు ఎంతోమంది అనుసరించి, పునీతం చేసిన బాట పైన మనంగూడా ప్రయాణం చేయాలి.ఎందుకంటే ఆ మంచి బాట పై పయనించిన వరికేన్నాడు చలనం వుండదు. -మనుస్క్రతి
29)అంతులేని బంధనాల్లో మనిషిని యిరికించివేసి, ఎన్నోవిధాలుగా యిబ్బంది పెట్టే ఆశలపశాలని తునాతునకలు చెయ్యగలిగేది వైరాగ్యం అనే పదునైనా కత్తి ఒక్కటే.-భాగవతం
30)కోపం యమధర్మరాజులాంటిది.తృష్ణ వైతరణి లాంటిది.విద్య కామధేనువు లాంటిది.ఇక సంత్రుప్తి దేవరాజైన ఇంద్రుడు నన్ధనవనం లాంటిది. -చాణక్యుడు