Soundarya lahari Telugu – Nori Bhogeeswara Somayaji Sarma

సౌందర్య లహరి
(శ్లోక తాత్పర్య సహిత విపుల వ్యాఖ్యతో)

594.00

Share Now

Description

సౌందర్య లహరి | Sowndarya lahari Telugu
(స్లోకాతాత్పర్య సహిత విపుల వ్యాఖ్యతో) 
-Nori Bhogeeswari Somayaji Sarma

సామాన్యులకు, సాధకులకు.. సౌందర్యలహరి

స్త్రీ పుంభేదాతీతమైన అవ్యయతత్త్వమే ‘సౌందర్యం’. సర్వజగత్కారమైన సచ్చిదానంద స్వరూపానికి అది పర్యాయపదం సకలోపాధులలో ప్రవహించే చైతన్యం కనుకనే ‘లహరి’. ఆ తత్త్వాగ్ని త్రిపురసుందరీ విద్యగా ఉపాసించే సమయాచార సంప్రదాయాన్ని సుప్రతిష్టితం చేస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు అందించిన స్తుతి సాహితి ‘సౌందర్యలహరి’. ఒక మంత్రంశాస్త్రంగా – మరొక కవితా పీయూషంగా – ఇంకొక తత్త్వదీపిగా కలగలిపి అందించిన శ్రీచక్రవిలసమిది.

       బ్రాహ్మీమయమూర్తులు, పరదేవతోపాసనానిష్టులు, గురు ‘దత్త’ విభూతి కలిగిన మహాత్ములు బ్రహ్మశ్రీ నోరి భోగీశ్వరశర్మగారు లోకోపకారంగా అందించిన మరో అనర్ఘవ్యాఖ్యారత్నం ఈ గ్రంథం. శ్రీలొల్ల లక్ష్మీధారుణి టీకను గ్రహించి తేట తెలుగులో, సుబోధకంగా అనుగ్రహించిన ఈ భాష్యం సాధకులకు కరదీపిక. ఉపాసనాపరులకు దిక్సూచి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంగా అనుష్టించవలసిన విధులను అందించే ఈ సప్రమాన గ్రంథానికి సవినయ నమస్సులు. – సామవేదం షణ్ముఖశర్మ