హనుమదారాధన
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్
యీ మహాగ్రంథం ”శ్రీహనుమత్ సర్వస్వము”గా చెప్పాలి. శ్రీ స్వామివారు బహుముఖ ప్రజ్ఞా పాటవాలనీ యిందులో కానవస్తున్నాయి. ఎన్నో గ్రంథాలను పరిశోధించి పరిపూర్ణ హనుమ కథలను భక్తిజ్ఞాన వైరాగ్యాలను అందకోరికగల పాఠకులు, గురుముఖతాగాని, లేదా స్వయంగా గాని యీ గ్రంథాన్ని నిత్యమూ పారాయణ గావించి తరించుటకు మన పూర్వ పుణ్యంవలన మనకీ గ్రంథం లభించింది.
యీ గ్రంథం బహు భద్రముగా దాచుకొని ముందుగా గ్రంథాన్ని పూజించి పారాయణగావించి, శ్రీహనుమ కటాక్షంతో మహత్తర సత్ఫలాన్ని అందుదురుగాక! విలక్షణ ప్రతిభా సంపన్నుడగు శ్రీ సాయిరామ్ అందించాడు. యిలాగే వారి అద్వితీయ జ్ఞానాన్ని అన్నివిధాలా ప్రజలకు పంచి వారి కృతజ్ఞతలతోపాటు, శ్రీ హనుమద్బ్రహ్మ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందాలని నా ఆకాంక్ష- విద్యారణ్యస్వామి