Lakshmi Aradhana

లక్ష్మీ ఆరాధన
– డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

120.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
,
Tag:
Share Now

Description

లక్ష్మీ ఆరాధన
Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

…అప్పుడు జగమంతా లక్ష్మీ నివాసం!
పుణ్యాల రాశి… సర్వజగత్తుకూ కల్పవల్లి… దారిద్య్ర వినాశిని… సౌభాగ్యదాయిని…పాలకడలిలో పుట్టిన దీపశిఖ…శ్రీమహాలక్ష్మి… లోకాలన్నిటికీ సర్వ శుభాలనూ చేకూర్చే ఆ తల్లి ఎవరింట ఉంటుందో ఆ ఇంట్లో తానూ ఉంటానని పరమాత్ముడు చెప్పారు. సిరిహరి కలిసి ఉన్న ఆ ఇంట్లో లేనిదేముంటుంది. మరి సిరి ఎక్కడుంటుంది? సత్కర్మలలో, సదాశయాల్లో, సదాచారాల్లో, నీతినియమాల్లో అమ్మవారు కొలువుంటారని మార్కండేయ పురాణం చెబుతోంది. వ్యసనాలు, సత్ప్రవర్తన, శారీరక, మానసిక శుద్ధి లేని వారింటిని శ్రీమహాలక్ష్మి విడిచిపోతుందని జైమినీ భారతం తెలియజేస్తోంది. అందుకే డబ్బుకన్నా ముందు మంచి గుణగణాలను ఇమ్మని అమ్మను ప్రార్థించాలి. లక్ష్మీ విభూతుల్లో మనిషి చెమట చిందించే చోటు ప్రముఖమైన లక్ష్మీ స్థ్ధానంగా చెప్పారు. అంటే శ్రమే సంపద. శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసమే.
లక్ష్మీదేవి సకల సంపదలకు ప్రతీక. సకల సౌభాగ్యాలకూ చిహ్నం. మనిషి సుఖమైన, శుభప్రదమైన జీవితం గడపడానికి కావాల్సిన సమస్త అంశాలను సంపదగానే పరిగణిస్తారు. ధనధాన్యాలు, సంతానం, ఆరోగ్యం, జ్ఞానం వంటివన్నీ కోరేవారంతా లక్ష్మీకటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి… వగైరా పేర్లతో వారివారి అభీష్టం మేరకు ఆరాధిస్తారు.
లక్ష్మీ స్తోత్రాల్లో ‘దారిద్య్ర ధ్వంసినీం దేవీం సర్వ ఉపద్రవ వారిణీమ్‌’ అని ప్రార్థన ఉంటుంది. లోకంలోని సకల దారిద్య్రాలను పారదోలే దేవత శ్రీ మహాలక్ష్మి. సర్వ ఉపద్రవాలను నివారించగల దేవత ఆమె. అందుకే ఆమెను శంకర భగవత్పాదులు ‘సంపత్కారిణి’ అనీ, ‘త్రిభువన భూతకరీ’(ముల్లోకాలకు ఐశ్వర్యాన్నిచ్చేది) అనీ సంబోధించారు. రుగ్వేదంలోని ప్రధాన సూక్తాల్లో శ్రీసూక్తం దేవీ తత్త్వాన్ని మనకు అందించింది. సృష్టిలోని సంపదల్లో దాగున్న అమ్మ రూపాన్ని అపురూపంగా పదిహేను రుక్కుల్లో మనకు వివరించింది. ఇందులో
పుత్రపౌత్ర ధనం ధాన్యం
హస్త్యశ్వాజావిగోరథమ్‌
ప్రజానాం భవసి మాత
ఆయుష్మంతం కరోతు మామ్‌
పుత్రపౌత్రులు, ధనధాన్యాలు, ఏనుగులు, ఇతర సంపదలను అనుగ్రహించు తల్లీ… నాకు ఆయుర్ధాయాన్ని ప్రసాదించమని అంటోందీ రుక్కు. ఇందులో ఆయుష్షును ప్రత్యేక సంపదగా పేర్కొంటోంది. మిగిలిన సంపదలు అనుభవించాలంటే మొదట ఆయుర్ధాయం కావాలి. దానికి ఆరోగ్యం కావాలి. ఈ సూక్తాన్నిబట్టే ఆరోగ్యమే మహాభాగ్యమని… అది కూడా లక్ష్మీ స్వరూపమని తెలుసుకోవాలి. వనాలు, ఆకులు, సుగంధ ద్రవ్యాలు, ఆవుపేడ, బిల్వ వృక్షం… ఇవన్నీ శ్రీలక్ష్మికి నివాసాలు. అడవులు, నదులు, పర్వతాలు, ప్రకృతిలో ఉన్న అమ్మను ప్రసన్నురాలిని చేసుకోవడమే మన ప్రగతికి శ్రీకారంగా గుర్తించాలి.
ఏమికోరినా అనుగ్రహించే తల్లి కాబట్టి ఆమెను వరలక్ష్మిగా సంబోధించారు. ‘వ్రతవ్యే అనేన అనయావా అతి వ్రతం…’ జీవితాంతం ఒక దీక్ష మాదిరిగా దేన్ని పాటిస్తామో అది వ్రతం అవుతుంది. ఈ నేపథ్యంలోనే శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఒక్కరోజు మాత్రమే నిర్వహించే వరలక్ష్మీ పూజను మన పెద్దలు వ్రతంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.

– డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు, వై.శ్రీలక్ష్మీరామకృష్ణ

నాలుగు రకాల పురుషార్థాలను ప్రజలకు అందించేందుకు అమ్మవారు ఫాల్గుణమాసం ఉత్తరానక్షత్రంలో పౌర్ణమివేళ నాలుగు చేతులతో అవతరించారు. అందుకే అమ్మవారికి శుక్రవారం ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఏటా శ్రావణమాసంలో ప్రతి శుక్రవారాన్ని విశేషమైన పండగగా చేసుకుంటారు. ముఖ్యంగా మహిళాలోకంలో శ్రావణశుక్రవారానికి విశేష ప్రాధాన్యం ఉంది.

సిరులిచ్చే శ్రీలక్ష్మి అనుగ్రహం పొందడానికి పూజలు, వ్రతాలు, స్తోత్రాలు ఉపకరించవచ్చు. వాటికి ఆ తల్లి ఆనందించనూ వచ్చు. అయితే భక్తుడి ఇంట ఎప్పటికీ తానుండాలంటే మరికొన్ని నియమాలను కూడా పాటించాలని ఆమె చెప్పినట్లు మహాభారతం శాంతి పర్వంలో ఉంది. లక్ష్మీదేవి తానెక్కడెక్కడ ఉంటానో స్వయంగా ఇంద్రుడికి చెప్పినట్లు అందులో ఉంది. ఆమె మాటలను తిక్కన సీసపద్యంలో ఇలా వర్ణించారు. అవే లక్ష్మీస్థానాలుగా పరిగణిస్తారు.

గురుభక్తి నిరతులు, సురపితృపూజన
పరులును, సత్యసంభాషణులును,
దానశీలురుఁ, బరధనపరదారప
రాఙ్ముఖచిత్తులు, బ్రాహ్మణప్రి
యులు, దివానిద్రావియుక్తులు, వృద్ధదు
ర్బలదీన యోషిత్కృపారతులును
శౌచులు, నతిథిభోజనశిష్టభోజులు
నేను మెచ్చు జనంబు; లిట్లుగాక
* ఎక్కడ గురుభక్తి కలవారుంటారో అక్కడ
* ఎక్కడ తల్లిదండ్రులను పూజించే వారుంటారో అక్కడ
* ఎక్కడ దానగుణం కలిగిన వారుంటారో అక్కడ
* ఎక్కడ ఇతరుల ధనం ఆశించని వారుంటారో అక్కడ
* ఎక్కడ బ్రాహ్మణులను ఆదరించే వారుంటారో అక్కడ
* ఎక్కడ పగటి పూట నిద్రించని వారుంటారో అక్కడ
* ఎక్కడ వృద్ధుల, దీనుల ఆదరణ ఉంటుందో అక్కడ రుంటారో అక్కడ
* ఎక్కడ శుచీ, శుభ్రత ఉంటాయో అక్కడ
* ఎక్కడ అతిథి, అభ్యాగతుల సేవ జరుగుతుందో అక్కడ తానుంటానని… అలా ఉండేవారిని తాను అనుగ్రహిస్తానన్నది లక్ష్మీదేవి మాట.
అలాగే తన అనుగ్రహం పొందలేని వారి గురించి కూడా ఆమె చెప్పింది…
ధర్మ మెడలి, కామంబు క్రోధంబుఁ జాలఁ;
గలిగిగర్వులై బలియు భైక్షంబునిడక
పరుష వాక్కులఁ గ్రూరంపుఁ జరితములను।
మిగిలి వర్తించువారు నా మెచ్చుగారు
* ధర్మాలను పాటించని వారు
* కామక్రోధాలు ఎక్కువగా ఉన్నవారు
* గర్వం ఉన్నవారు
* పేదలకు భిక్ష, పూజా సామగ్రి ఇవ్వని వారు
* కఠినమైన మాటలాడేవారు
* క్రూర మనస్తత్వం ఉన్నవారు