Astadasa Puranalu (telugu)

అష్టాదశ పురాణాలు

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

Fullset Order ADD CART

225.001,200.00

Clear
Share Now

Description

Astadasa Puranalu book in telugu

అష్టాదశ పురాణాలు Astadasa Puranalu book

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

  • “మ” ద్వయం — మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • “భ” ద్వయం — భాగవత పురాణం, భవిష్య పురాణం
  • “బ్ర” త్రయం — బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • “వ” చతుష్టయం — విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ — అగ్ని పురాణం
  • నా — నారద పురాణం
  • పద్ — పద్మ పురాణం
  • లిం — లింగ పురాణం
  • గ — గరుడ పురాణం
  • కూ — కూర్మ పురాణం
  • స్కా — స్కాంద పురాణం

అష్టాదశ పురాణాలు 

Book Name Author Pages Price
Garuda Puranam
గరుడ పురాణం
Dr. Yallayi Narayana Rao
Dr. యల్లాయి నారాయణ రావు
776 ₹600
Sri Bhavishya Mahapuranamu
శ్రీ భవిష్య మహాపురాణము
₹540
Sri Narada Bha Bhagatham

నారద మహాపురాణం

Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
795 ₹549
Sri Vishnu Mahapuranam Vachanam
శ్రీ విష్ణు మహాపురాణం (వచనం)
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
504 ₹250
Sri Varaha Maha Puranam
శ్రీ వరాహ మహాపురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
664 ₹750
Sri Padma Maha Puranamu-1
శ్రీ పద్మ మహాపురాణము-1
Granthi Latha
గ్రంథి లత
608 ₹500
Sri Padma Maha Puranamu – 2
శ్రీ పద్మ మహాపురాణము-1
Granthi Latha
గ్రంథి లత
₹500
Sri Linga Mahapuranamu
శ్రీ లింగ మహాపురాణము
710 ₹500
Sri Markandeya Mahapuranam
శ్రీ మార్కండేయ మహాపురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
608 ₹349
Sri Brahma Vaivarta Maha Puranam – Hard Cover – 2011
శ్రీ బ్రహ్మ వైవర్త మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
1120 ₹750
Sri Vayu Maha Puranam Hardcover – 2007
శ్రీ వాయు మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
832 ₹500
Sri Matsya Mahapuranam Hardcover – 2012
శ్రీ మత్స్య మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
920 ₹500
Sri Kurma Mahapuranam (Telugu) Hardcover – 2012
శ్రీ కుర్మా మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
320 ₹225
Sri Brahma Mahapuranam Hardcover – 2011
శ్రీ బ్రహ్మ మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
456 ₹300
Sri Vamana Mahapuranam Hardcover – 2012
శ్రీ వామన మహా పురాణం
352 ₹600
Sri Skanda Maha Puranam Vol 1 (Telugu) Hardcover – 2014
శ్రీ స్కాంద మహా పురాణం-1
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
1289 ₹800
Sri Skanda Maha Puranam Vol 2 (Telugu) Hardcover – 2014
శ్రీ స్కాంద మహా పురాణం-2
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
₹900
Sri Brahmanda Maha Puranam (Telugu) Hardcover – 2012
శ్రీ బ్రహ్మాండ మహా పురాణం
504 ₹600
Sri Agni Maha Puranam (Telugu) Hardcover – 2014
శ్రీ అగ్ని మహా పురాణం
Avancha Satyanarayana
అవాంఛ సత్యనారాయణ
936 ₹599

#మత్స్య_జయంతి

శ్రీ మహావిష్ణువు ధర్మరక్షణ కోసం ధరించిన దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం. సృష్టి పరిణామ క్రమంలో మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సంకేతంగా చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు ‘మత్స్యజయంతి’ జరుపుకొంటారు. సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి నాలుగు వేదాలూ ఎత్తుకుపోయి సముద్రంలో దాక్కున్నాడు. దాంతో బ్రహ్మ సృష్టికార్యానికి ఆటంకం ఏర్పడింది. బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకున్నాడు. స్వామి మత్స్యరూపం ధరించి సముద్రంలోకి చొచ్చుకుపోయి సోమకాసురుణ్ని సంహరించి, తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తెచ్చి బ్రహ్మకు అందజేశాడు. ఇది సంక్షిప్తంగా మత్స్యావతార గాథ.

వరాహ కల్ప గాథ వేరొకటి మనకు పురాణాల్లో కనిపిస్తుంది. వైవస్వత మనువు ‘కృతమాలిక’ నదీ తీరంలో పితృదేవతలకు జలతర్పణం చేస్తుండగా ఒక చేపపిల్ల అతడి దోసిట్లో పడింది. అతడు కరుణించి, ఆ చేపపిల్లను తన కమండలంలో వేశాడు. మర్నాటికి ఆ చేపపిల్ల పెద్దదై తనకు ఈ కమండలం సరిపోలేదంది. మనువు దాన్ని తీసి ఒక చెరువులో విడిచాడు. ఆ చెరువు దానికి సరిపోలేదు. చేప రోజురోజుకూ పెద్దదైపోతుంటే రాజు దాన్ని సముద్రంలో విడిచాడు. మత్స్యం అంతలో రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగిపోయింది. మనువు సంభ్రమాశ్చర్యాలకు లోనై ‘స్వామీ, నీవెవరు?’ అని అడిగాడు. అప్పుడు ఆ మీనం తన వైనం చెబుతుంది. ‘రాజా! నేను శ్రీమన్నారాయణుడిని. ఏడు రోజుల్లో ప్రళయం రానున్నది. సకల జీవకోటి నశిస్తుంది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తున్నది. కాబట్టి వేదాలు, విద్యలు, బీజాలు, నేను, బ్రహ్మ… నీ రక్షణ పొందవలసి ఉంది. ఇక్కడ సప్త రుషులతో కూడిన ఓ నావ ఉంటుంది. నీటి మీద తేలుతూ అనంతుడనే సర్పం ఇక్కడికి చేరుతుంది. దాన్ని తాడు చేసి ఆ నావను నా కొమ్ముకు కట్టివెయ్యి!’

సత్యవ్రతుడైన మనువు విష్ణువు చెప్పినట్లే చేశాడు. అంతా సురక్షితులయ్యారు. అంతర్ధానమైన మత్స్యం అవతారమూర్తిగా ప్రశంసలందుకుంది. ఆ విధంగా వేదాలు శాశ్వతత్వాన్ని సంతరించుకుని మానవ మేధకు జ్ఞాన సుధలందిస్తున్నాయి.

దక్షిణావర్త శంఖవృత్తాంతం కూడా ఈ మత్స్యావతార గాథతో ముడివడిఉంది. మత్స్య రూపుడైన విష్ణువు సోమకాసురుడి కడుపు చీల్చి వేదాలను వెలుపలికి తీస్తున్న తరుణంలో పవిత్రమైన దక్షిణావర్త శంఖం వెలువడింది. స్వామి శంఖాన్ని తాను తీసుకుని, బ్రహ్మకు వేదాలు అప్పగించాడు. తమస్సు నుంచి వేదాలు వెలుగులోకి రావడంతో బ్రహ్మ సృష్టికార్యానికి కలిగిన ప్రతిబంధకం తొలగిపోయింది. బ్రహ్మ సహజ స్వరూపాన్ని పొందడమే వేదాలు మళ్ళీ మత్స్యావతారధారణతో లభ్యం కావడానికి గల తత్వార్థం. పరమాత్మ వల్ల సంప్రాప్తించిన ఆ వేదాలు మానవ కోటి ఆధ్యాత్మిక మహాభ్యుదయానికి వరప్రసాదాలు. మత్స్య జయంతి గురించిన వృత్తాంతం ధర్మ సింధువు, స్మృతికౌస్తుభం, ఆమాదేర్‌ జ్యోతిష గ్రంథాల్లో విపులంగా ఉంది.

క్రైస్తవుల్లో మత్స్యం శాంతి దేవతగా ఆరాధనలందుకుంటోంది. మహమ్మదీయులూ చేపను దైవంగా భావిస్తారు. బౌద్ధ జాతక కథల్లో బుద్ధుడు మీనంగా అవతారమెత్తిన కథా ఉంది. మన దేశంలో మత్స్యావతారానికి ఒకే ఒక దేవాలయం ఉంది. అది తిరుపతికి 70 కి.మీ. దూరంలో నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయ అభివృద్ధికి శ్రీకృష్ణదేవరాయలు చాలా సహకరించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడిని వేదనారాయణస్వామి ఆలయం అని పిలుస్తారు. – చిమ్మపూడి శ్రీరామమూర్తి

Additional information

Mahapuranaalu

Garuda Puranam, Sri Agni Mahapuranam, Sri Bhavishya Mahapuranamu, Sri Brahma Mahapuranam, Sri Brahma Vaivarta Mahapuranam, Sri Brahmanda Maha Puranam, Sri Kurma Mahapuranam, Sri Linga Mahapuranamu, Sri Markandeya Mahapuranam, Sri Matsya Mahapuranam, Sri Narada Mahapuranam, Sri Padma Mahapuranamu – 1, Sri Padma Mahapuranamu – 2, Sri Skanda Maha Puranam – 1, Sri Skanda Maha Puranam – 2, Sri Vamana Mahapuranam, Sri Varaha Mahapuranam, Sri Vayu Mahapuranam, Sri Vishnu Mahapuranam, Srimadandra Mahabhagavatham