Sri Krishna Bhagavatam

Pilaka Ganapathi Shastry

శ్రీకృష్ణ భాగవతం 1,2 Parts

1,440 pages

 

700.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

శ్రీ కృష్ణ భాగవతం
పిలకా గణపతి శాస్త్రి Sri Pilaka Ganapathi Shastri

    భాగవత పురాణం గహనమైన రచన. పోతనగారి ఆంధ్రీకరణంతో వన్నెకెక్కింది. శ్రీకృష్ణభాగవతం పిలకా గణపతి శాస్త్రిగారి మనోజ్ఞ వచనానుసరణం. ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకుంది.

     శ్రీమహావిష్ణువు ఏకవింశతి అవతారాల వర్ణన భాగవతంలో ఉంది. అయితే ప్రసిద్ధంగా చెప్పుకొనేవి దశావతారాలే. అందునా భాగవతంలో కృష్ణావతరానికి ప్రశస్తి ఎక్కువ. కృష్ణావతార గాథను వర్ణించే దశమ స్కంధం భాగవత స్కంధాలన్నిటిలోనూ విపులమైంది. పోతనగారు చెప్పినట్లు –

లలిత స్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతా శోభితమున్‌ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్‌ సుందరో
జ్జ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబు నై
వెలయున్‌ భాగవతాఖ్య కల్పతరువుర్విన్‌ సద్ద్విజశ్రేయమై.