Rukminisha Vijayam Telugu

రుక్మిణీశ విజయం

999.00

Share Now

Description

మధ్వాచార్య పరంపరలో రెండవవారైన వాదిరాజతీర్థరు రచించిన సంస్కృత మహాకావ్యానికి తెలుగులో విస్తృత వ్యాఖ్య

***

రుక్మిణీశవిజయ మొక మహాకావ్యం. భాగవత దశమస్కంధంలోని కృష్ణకథ ఇందులో ప్రతిపాద్య విషయం. అది 19 సర్గల మహాకావ్యంగా రూపాన్ని పొందింది.

రుగ్మిణీశవిజయమని కవివ్యవహరించిన పేరు. తెలుగువారికి రుక్మిణి అన్న పదమే బాగా పరిచయం. అందుకే జశ్త్వరహితంగా రుక్మిణి అన్నపదాన్నే స్వీకరించటం జరిగింది.

శ్లోక వ్యాఖ్యకు సంబంధించి – పదచ్ఛేదాన్ని విడిగా ఇవ్వలేదు సాధారణస్థితిలో, బంధురయమకబంధమున్నచోట మాత్రమే పదచ్ఛేదాన్ని విడిగా చూపటం జరిగింది. ధాతువులు దాదాపుగా నిరనుబంధంగానే నిర్దేశింపబడ్డాయి. క్వాచిత్కంగా సానుబంధంగా కనిపించినా అవి అజనుబంధాలే.  – సూరం శ్రీనివాసులు