Periya Puranam Telugu

పెరియ పురాణం free pdf


మరిన్ని పుస్తకాలకై

Category:


Share Now
నాయనార్లు శివభక్తులు
 
నయనార్లు క్రీ.శ 5, 10వ శతాబ్దాల మధ్య తమిళనాడు రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం పెరియపురాణంలో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.
 
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
చరిత్ర
క్రీ.శ.4,5 శతాబ్దములవరకున్ను దేశములో బౌద్ధ, జైన మతములు సుస్థిరపడినవి. వాటిమూలమున వైదికమతమునకు గొప్ప దెబ్బ తగిలినది. జైన బౌద్ధములకు పూర్వము తమిళదేశములో నుండిన మతములెట్టివో తెలియదుకాని, ఉత్తరమునుంచి బ్రాహ్మణులు వలసవచ్చిననాటినుంచిన్ని వాటిని వైదికమతముతో సంబదించినవాటిగా మార్చడానికి ప్రయత్నించి ఉంటారు. ఈ ఉత్తరవైదికమతముకున్ను, దక్షిణాత్యమతములుకున్ను కలిగిన సమ్మేళనము వలన క్రొత్త సంప్రదాయము లీ ప్రాంతములలో ఏర్పడినవి. ఇవియే తమిళశైవ సంప్రదాయము, తమిళవైష్ణవసంప్రదాయము అనేవి. తమిళశైవ సంప్రదాయము నాయనార్ల మూలమునను, తమిళవైష్ణవ సంప్రదాయము ఆళ్వార్ల మూలమును వ్యాప్తిచెందినవి.
 
బౌద్ధ, జైన మతములు స్థిరపడడానికి తోడ్పడిన ముఖ్యవిధానము “ఆహార-అభయ-భైషజ్య-శాస్త్రదానము”. వీటిలో ఆహార-అభయ-భైషజ్యములు జనులకు నిత్యమున్ను కావలసినవే. మిషనరీ లందరూ ఏమతమువారైనా ఈమూడింటిని వినియోగించే తమ మతమును వ్యాప్తిలోనికి తెచ్చుకొనేది. ఆపద్ధతినే అవలంబించకపోతే శైవమతమును వ్యాప్తిలోనికి వచ్చి బౌద్ధజైనమతప్రచారము నిలువదని ఆకాలములో తోచింది. దానికి తోడు కేవలము శాస్త్రముగాక భక్యవేశముకూడా పుట్టిస్తేగాని మొదటి మూడున్ను నిష్ప్రయోజనములు అవుతాయని తోచింది. ఈపద్ధతులన్నింటినీ ఆనాటి శైవమతావేశాపరు లాచరణలోనికి తెచ్చారు. అందులో భక్తివ్యాప్తికి భక్తచరిత్రములు చాలా ఉపయోగపడినవి. ఆశైవభక్తులకే “నాయనార్లు” అనిపేరు.
 
నాయనారు అంటే పూజ్యుడు అని అర్ధము. శివభక్తులెవరినా పూజ్యులే. అయినా, వారిలో ఎక్కువ ప్రసిద్ధిపొదినవారి పేళ్ళు జనశ్రుతిలో స్థిరముగా నిలచినవి. అసంఖ్యాతమహేశ్వరులలో అరవైముగ్గుర పేళ్ళు మాత్రము రానురాను జనుల వాడుకలోను, శైవప్రచారములోను నిలిచినవి. వీరినే అరవత్తుమూవురు (అఱుబత్తుమూవర్) అని అంటారు.
 
నాయనార్ల సంఖయ్ 63గా ఏర్పడడానికి కారణములేకపోలేదు. జైనబౌద్ధమత ప్రచారమును అరికట్టడానికి పూనుకొనిన మతప్రచారకులు వాతిలో ఉన్న పోలికలతో నూతన మతనిర్మాణములోనికి దిగుమతిచేసి జనులకు నమ్మకము పుట్టించి ఉంటారు. ఒకప్పుడున్న పేరునట్లే ఉంచి తత్సంబధమైన కథను వేరేగా చెప్పబడింది.
 
జైన సంప్రదాయములో త్రిషష్టిశలాకా పురుషులున్నారు. ఈత్రిషష్టినటులే శైవులు ఉపయోగించుకునారు. త్రిషష్టి సలాకా పురుషులలో 24 తీర్ధంకరులు, 12 గురు చక్రవర్తులు, 9 గురు బలదేవులు, 9 గురు వాసుదేవులు, 9 గురు ప్రతివాసుదేవులు చేరినారు. మొతాం 63 మంది అయినారు. ఈ సంఖ్యను తప్పిస్తే కార్యములేదు. కాబట్టి తమిళనాయనర్లు మొత్తం 63 మంది. వీరిలో 24 గురు తీర్ధంకరులలో మొదటివాడు ఋషభుడు. ఇతడు శైవములో బసవడైనాడు.మూడోవాడు శంభవుడు. ఇతడు నాయనార్లలో శంభుచిత్తుడైనాడు. నాలుగోవాడు అభినందనుడు. ఇతడే అభిరాముడనే నాయనరయినాడు. ఇతడే నందుడుగకూడా మారి ఉంటాడు. 7వ తీర్ధంకురడైన సుపార్స్వనకును, 23 వవాడైన పార్స్వునకును మారుగా పూసలనాయనా ఏర్పడినాడు. ఇతడు తొమ్మిదో తీర్ధంకురుడైన పుష్పదంతునికి కూడా శాఇవప్రతినిధి కావచ్చును. చంద్రపభుడనే 8వ తీర్ధంకుడే చండేశనాయనారయి ఉంటాడు. 15వ తీర్ధంకరుడు ధర్ముడు. ఇతడు నాయనార్లలో ధర్మభక్తుడైనాడు. 17 వ తీర్ధంకరుడైన కుంధు అనేవాడు కుత్తవనాయనారుగా అయి ఉండవచ్చును.
 
వీర శైవము తలదూపినదాక బసవడులేడు. బసవేశ్వరునికి పూర్వసంప్రదాయములో అతడు ఋషభునికి నామాంతరమైన ఆదినాధునికి దగ్గర ఉచ్చారణ గల అతిభక్తుడు అనేపేరుతో నిలిచాడు. ఈఅతిభక్తుడే ఆడిభర్త, అతిపత్తార్ అనేనామాంతరములతో కనబడుతున్నాడు. ఇదిగాక నాయనార్లలో కొందరికి జైనమతముతోడి సంబంధము శాఇవసంప్రదాయములో కూడా విస్మృతము కాలేదు. వాగీశనాయనారనే నామాంతరము గల అప్పరుకు ధర్మసేనుడనే పేరుకూడా ఉంది. అప్పరు అనేక జైనగ్రంధములనుకూడా వ్రాసినాడు. జైన మతమునకున్న, శైవమునకున్ను గల ఇట్టి పోలికలనింకా విస్తరించి వ్రాయవచ్చును. ఇట్లే బౌద్ధముతోడి పోలికలుకూడా ఈ శైవములో కనబడుతున్నవి. శాక్యనాధుడనే నాయనారు స్వయముగా శాక్య నాధుడైన బుద్ధభగవానుని ప్రతిబింబమే. అట్టి పోలికను మరుగుపెట్టడానికాపేరును సాంఖ్యతొండుడుగా మార్చుకొన్న సాంఖ్య తొండడే శాక్యనాధుడనే స్మృతి శైవసంప్రదాయము నుంచి తొలగిపోలేదు.