Description
మానవ కథ -బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్
పాండిత్యంలో గొప్పవారు సైతం గొప్పది అని కీర్తించిన పద్య కావ్యం మానవ కథ
నవ కథలు నేటి తరాలకు నవ నిధులు వంటివి, నవరసాలను కలబోసి లక్ష్మీ దేవి యొక్క సందేశం లా ముక్తిని పొందిన మునివర్యుని ముందుంచి 9 కథల ద్వారా భిన్న పాత్రలతో
బిక్షుక చరిత్ర – రాత లేని వానికి లక్ష్మీదేవి ఎంత ప్రయత్నించినా లక్ష్మీపై ఒక వ్యక్తి యొక్క కర్మములు ఎలా విజయం సాధిస్తాయో చెప్పే కథ
పుష్కర చరిత్ర – రాత ఉన్నవానికి పుణ్యఫలం అనుభవించక తప్పదు. ఆద్యంతం ఉత్కంఠ తో సాగే కథ
సుధాకర చరిత్ర – నీచుని సొమ్ము అశుభకరం, పామునోటిలోని విషంతో సమానమని చెప్పే అద్భుత కథ
మంత్ర మహిమ – ఎన్నో సద్గతులు పొందుటకు , మరెన్నో అద్భుతమైన, రహస్యమైన స్తోత్రములు చదివే అధికారం లభించే ఏకైక మార్గం మంత్రం, సద్గురువులు ద్వారా పొందిన మంత్రం నిష్ఠతో పారాయణ చేసుకుంటే ఎలా కాపుడుతుందో చెప్పే కథ
గురుపత్ని మహిమ – గురువును సేవించే శిష్యులు గురుపత్ని పై సైతం మరింత భక్తిని చాటి అభేదం చూపిన వానికే పూర్తి మంత్ర ఫలితం లభిస్తుంది.
సుందరకాండ పారాయణం – గురుభక్తి
సుందరకాండము పారాయణ చేసినవానికి అనంత సంపదలు ఇస్తానని లక్ష్మీ దేవి శపథం చేసి నారాయణుని సాక్షిగా చెప్పే గొప్ప కథ, గురుభక్తి లేకపోయినా, ఒకనాడు దరిచేరి, తరువాత గురువును మరిస్తే ఎటువంటి ఫలితాలు పొందుతారో చెప్పే మంచి కథ
భస్మ మహిమ
భస్మ ధారణ చేస్తే వచ్చే ఫలితం ఆదిశేషునికైనా అసాధ్యం అని చెప్పే ఒకానొక అరుదైన, అద్భుతమైన కథ
పురాణ మహిమ
పురాణాలు పెద్దనౌక. ఆ నౌక అండతో పిల్లవాడి అడుగును దాటినంత తేలికగా దారిద్ర్య సముద్రం దాటగలం అని , పురాణ శ్రవణ మాత్రం చేత లక్ష్మీదేవి ఆ వ్యక్తి ని ఆశ్రయిస్తుంది. వానికి శుభములొసుగును.
మాట సంపదల మూట
నేటి జీవనశైలిలో ఒకని మాట సామ్రాజ్యం , సంపదలు కలిగిస్తే, ఒకని మాట వల్ల తన సంపద, గౌరవం కోల్పోయే స్థితి కలుగుతుంది.అందుచేత మాట యొక్క మాహాత్మ్యం ను చెప్పే ఆఖరి తొమ్మిదవ గాథ.
ఇందులోని బిక్షుక కథనే మన ప్రణవపీఠంలో చదివే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామా !!!
WEIGHT | 0.275 kg |
---|---|
DIMENSIONS | 20 × 15 × 5 cm |