Vyasa Vidya

వ్యాస విద్య
-Brahmasri Vaddiparti Padmakar

 

120.00

Share Now

Description

శ్రీ వ్యాసవిద్య అనే గ్రంథం ఆంధ్ర భాషాభూషణ, అభినవశుక బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పుత్రీమణి కుమారి వద్దిపర్తి శ్రీవిద్యగారు రచించారు. ఈ వ్యాస సంపుటిలో పందొమ్మిది వ్యాసాలు ఉన్నాయి. అన్నీ వివిధ పురాణ సార సంగ్రహాలే. “చైత్రం” మొదలుకుని “ఫాల్గుణం” వరకు గల పన్నెండు మాసాలు ప్రాముఖ్యత ఆయా మాసాలతో ముడిపడియున్న అనాకానేక ముఖ్యాంశాలను స్పృశిస్తూ పాఠకులకు అమూల్యపురాణ జ్ఙానసంపదను అందించేలా విషయాలను పొందుపరిచారు. వ్యాసాలకు ఇచ్చిన శీర్షికలు చూడగానే చదవాలనిపించే విధంగా “జ్యేష్ఠం – ఆధ్యాత్మ మనీషా శ్రేష్ఠం”, “గురు విజ్ఙాన గూఢం ఆషాఢం” లాంటివాటితో ప్రతి మాసానికీ వివరణాత్మకమైన పురాణ విశ్లేషణను అందించారు. మరియు కొన్ని సామాజికస్పృహ కల్గించే అంశాలను, వివిధ గ్రంథాల-పురాణాల నుండి ప్రామాణిక పద్యాలు, శ్లోకాలతో సమన్వయపరుస్తూ చక్కని శైలిలో వ్యాసాలు అందించారు. ఈ పుస్తకమును గురించి ఎందరో మహానుభావులైన శ్రీ దత్తవిజానందతీర్థస్వామీజీవారు వారితో పాటు ప్రముఖులెందరో తమ అభిప్రాయాలను తెలియజేసి ఆశీస్సులందించారు.