Vallanki Thalam

వ‌ల్లంకి తాళం

-గోర‌టి వెంక‌న్న

225.00

+ Rs.70/- For Handling and Shipping Charges

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

Share Now

Description

Vallanki Talam

ప్ర‌సిద్ధ వాగ్గేయ‌కారుడు, ప్ర‌జాక‌వి, శాస‌న‌మండ‌లి స‌భ్యుడు గోర‌టి వెంక‌న్న హృద‌య‌మంతా పాట‌ల స‌వ్వ‌డితోనే మార్మోగిపోతోంది. ఆయ‌న హృద‌యాన్ని ప‌లుక‌రిస్తే.. మ‌న మ‌న‌సు పుల‌క‌రించి పోవాల్సిందే. ఆయ‌న నోటి వెంట జాన‌ప‌దాలు జ‌ల‌పాతాల్లా ప్ర‌వ‌హిస్తూనే ఉంటాయి. ప్ర‌కృతిలోని ప్ర‌తి వ‌స్తువుపై పాట‌ను అల్లి.. అందంగా తీర్చిదిద్దడం గోర‌టికే సొంత‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న రాసిన పాట‌ల్లో అత్య‌ధికంగా సామాన్యుడి జీవిత ఇతివృత్తంతో పాటు ప్ర‌కృతిపై రాసిన‌వే. మిక్కిలి పాట‌లు ప‌ల్లె జీవ‌నంతో ముడిప‌డి ఉంటాయి. అంత‌టి గొప్ప‌ ప్ర‌జా క‌వి గోర‌టి వెంక‌న్న‌కు కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు రావ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. ఆయ‌న రాసిన వ‌ల్లంకి తాళం క‌వితా సంపుటికి ఈ అవార్డు ద‌క్కింది. 32 గేయరూప క‌విత‌ల‌తో వల్లంకి తాళం అనే క‌వితా సంపుటి వెలువ‌డింది. ఈ క‌వితా సంపుటి నిండా ప‌చ్చ‌ద‌న‌మే క‌నిపిస్తోంది.

 

వ‌ల్లంకి తాళం’ క‌వితా సంపుటిలోని కొన్ని గేయాలు..

1. ‘గాలి పెదవులు తాకి వెదురు గానాలు

నీలి మబ్బుల జూసి నెమలి నాట్యాలు

వద్ది మద్దెల మీద వల్లంకితాళాలు

ఆటపాటల దరువు కడవి తొలి గురువు’

అందాల తనువెల్ల వంపుకున్న అడవి

అలరించిన తలపించె ఆకు పచ్చని కడలి

నిడివన్నదె లేని నీలి గగనం కింద

పారుటాకుల వలువ పంచుతున్నది సలువ

కావి రంగుతోని కనిపించే కొండలు

పైనవోయె దూది పడవల విడుదులు

గిరిమంద పొదుగులు జారె సెలయేరులు

శిలల నునుపుగ తొలిసె అలల మొనలు’

 

2. ‘వెన్నెల’ గేయంలో ‘సోయగమె వెన్నెల/ ఏరెంతో సోయగమె’ అంటూ పల్లవితో సాగే గేయంలో

‘సెలయేటి పరువాల చెక్కిలి నిమిరింది

సేపకనుగవ జూసి చూపు వాలేసింది

తన హోయలు తడుముకొని తనువార మురిసింది

ఇసుక తిన్నెల మీద వలువలన్నిప్పుకొని

చిరునవ్వు కలువల వెన్నెల శిరసొంచి ముద్దాడే వెన్నెల’

అందచందలున్నా నింగిలో వెన్నెల

అవనిపై మాన్యుల అంశల వెన్నెల

బుద్ధుని మునివేలి పద్మాన వెన్నెల

జైన తీర్థంకరుల జపమాల వెన్నెల

హఠయోగి వేమన అచలమే వెన్నెల

వీరబ్రహ్మం వెండి బెత్తమున వెన్నెల

సిద్ధయోగుల యొక్క సిగకొప్పు వెన్నెల

తిరుదాసరి బొంత చిగురులో వెన్నెల

విరుపాక్ష జంగాల సిరుశెంకు వెన్నెల

సూఫీల కొనగోట తొలువైన కిన్నెర

పరహితము కోసమై సర్వంబునొదిలిన

నిర్వికారి యొక్క చిరునవ్వు వెన్నెల’