Sampurna Garuda Puranam

సంపూర్ణ గరుడ పురాణం

510.00

+ Rs.40/- For Handling and Shipping Charges
Share Now

Description

గరుడ పురాణం | Sampoorna Garuda Mahapuranam

తప్పు దాగదు లెక్క తప్పదు!

నిన్నే…నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా…ఏం చేసినా ఫర్వాలేదులే అనుకుంటే కుదరదు…ప్రతి పనికీ ఓ లెక్క ఉంటుంది… దానికి ఫలితం ఉంటుంది…ఎందుకంటే మనిషి సంఘజీవి. అందరితో, అన్ని ప్రాణులతో సహజీవనం సాగించాలి. ఈ క్రమంలో నియమబద్ధమైన జీవితమే సదా అనుసరణీయం… అలా జీవించడాన్నే క్రమశిక్షణ అంటాం. ఆ గీతను దాటడమే అనేక సమస్యలకు మూలకారణం. అలా చేయడం అనేకమంది జీవితాలకు శాపం అవుతుంది. దాన్నే పాపం అంటారు. అలా ఈ లోకంలో చేసే పాపాలకు పరలోకంలో శిక్షలుంటాయని దాదాపు అన్ని ధర్మశాస్త్రాలూ చెబుతాయి. ఇక్కడ మనిషి చేసే పొరపాట్లేంటి…దానికి యమలోకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారనే విషయాన్ని గరుడ పురాణం చర్చిస్తుంది. ఈ పురాణం మరణం తర్వాత శిక్షల గురించి వివరించినా… పరోక్షంగా క్రమశిక్షణను ఉద్బోధిస్తుంది. నైతికతను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. సంఘ జీవిగా నువ్వేం చేయాలో, ఎలా జీవించాలో వివరిస్తుంది. అందుకే అది జీవన వికాస పురాణంగా భావించవచ్చు.

గరుడ పురాణం చెప్పేదిదే…
గరుడ పురాణం చదవవచ్చా?

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోకూడదని… చదవ కూడదని ప్రచారం లో ఉంది. ఇది కేవలం అపోహమాత్రమే. సంక్రాంతి, అమావాస్య, పౌర్ణమి, గరుడ పంచమి, పితృదేవతల పుణ్య తిథుల్లో ఈ పురాణాన్ని చదవాలని శాస్త్రవచనం. ఇది ఒక విజ్ఞాన సర్వస్వం అని గుర్తు పెట్టుకుని దాన్ని అధ్యయనం చేసి అందులోని తప్పులు చేయకుండా సక్రమమైన మార్గంలో జీవిస్తే జీవితం సుఖమయం అవుతుంది. సమాజం వర్ధిల్లుతుంది.

 

నమ్మించి మోసం చేసేవారికి
వింభుజ నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ తల్లకిందులుగా వేలాడదీసి క్రూర జంతువులకు వదిలేస్తారు

అలా చేస్తే… ఇలా జరుగుతుంది…
పరస్పర విశ్వాసం వల్లనే మనిషి మనుగడ, సమాజ మనుగడ సాగుతుంది. అయితే అనేక కారణాల వల్ల అది సన్నగిల్లుతోంది. చివరకు విశ్వాసఘాతుకానికి కారణమవుతోంది. నమ్మినవారిని మోసగించడం, ఆశపెట్టి మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, ఆహారంలో విషం పెట్టి సంహరించడం వంటివి విశ్వాసఘాతుకమైన చర్యలు. ఇవన్నీ పాప కార్యాలు… మనసును అదుపులో ఉంచుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, భగవంతుడిపై భక్తి పెంచుకోవడం మనిషిలో విశ్వాసగుణాన్ని పెరిగేలా చేస్తాయి.

ఇతరులను మాటలతో హింసించేవారికి, దుర్భాషలాడేవారికి
శీతమనే శిక్ష విధిస్తారు. అంటే అత్యంత చల్లగా ఉండే చీకటి కూపంలోకి విసిరేస్తారు.

మాటే మంత్రం… లేదంటే నరకం…
కఠినమైన మాటలతో ఇతరులను హింసించడం అత్యంత పాపకార్యమని నిర్వంచించింది గరుడ పురాణం. హిత భాషణం, వినయ భాషణం… అంటే మంచిగా మాట్లాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మంచి మాటలతో ఎవరినైనా ఆకర్షించవచ్చు. ఎలాంటి పనులైనా సాధించవచ్చు. ఇతరులను ప్రోత్సహించేలా సానుకూలమైన మాటలు చెప్పాలి. ఇతరులు కష్టాల్లో ఉంటే వారిని తక్కువగా మాట్లాడడం కూడా హింసిచడమే. అది శిక్షకు కారణమవుతుంది.

చుట్టు పక్కల చూడరా… చిన్నవాడా…
భూమిని చరాచర జీవరాశులు జీవించేందుకు అనువుగా సృష్టించాడు భగవంతుడు. జీవులన్నీ పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అలాంటి ప్రకృతిని రక్షించుకోడమంటే భగవంతుని సేవించుకోవడమే. చెట్లను నరకడం, ఇళ్లను కూల్చడం, చెరువులు పూడ్చడం, దేవాలయాలు కూల్చడం వంటివి ప్రకృతికి నష్టాన్ని కలిగించే అంశాలు శిక్షార్హమైనవి.

ప్రకృతికి నష్టం చేసి, ఇతర జీవుల మనుగడను దుర్భరం చేస్తే
యమపురి దక్షిణ ద్వారం దగ్గర ఉన్న వైతరణి నదిలో పడేస్తారు. తర్వాత దాని తీరంలో ఉన్న బూరుగు చెట్టుకు కట్టేసి కొడతారు.

– ఐ.ఎల్‌.ఎన్‌.చంద్రశేఖర్‌

వినయమే భూషణం
వినయం జ్ఞాన లక్షణం. దాన్ని అలవర్చుకుంటే అహంకారం తొలగిపోతుంది. సీతాన్వేషణకు లంకకు బయల్దేరిన హనుమంతుడు సీతాదేవితో వానర సైన్యంలో నాకంటే శక్తివంతులు, బలవంతులైన వానరులే ఉన్నారు. అని అన్నాడు. మహాబలశాలి అయిఉండీ తనను తాను తగ్గించుకుని మాట్లాడుతున్న హనుమంతుని అప్పుడే జ్ఞానిగా గుర్తించింది… సమాదరించింది సీతామాత. డబ్బు, బలం ఎక్కువగా ఉన్నాయని ఇతరులను అవమానించడం పాప కార్యమని గరుడ పురాణం చెబుతుంది.

అహంకారంతో అందరినీ చిన్నచూపు చూసినవారికి
సూచీముఖి అనే నరకంలో శిక్ష ఉంటుంది. అక్కడ సూక్ష్మ శరీరాన్ని సూదులతో గుచ్చి హింసిస్తారు.

ధర్మ ధిక్కారానికి
మహాజ్వాల అనే నరకంలో శిక్ష ఉంటుంది. పెద్దగా మండుతూ ఉన్న అగ్ని జ్వాలల్లో వేస్తారు.

ధర్మమే రక్షిస్తుంది…
ధర్మో రక్షతి రక్షితః అంటారు. ప్రజల జీవితాన్ని క్రమ పద్ధతిలో పెట్టే ధర్మాలను ధ్వంసం చేయడం అత్యంత పాపకార్యం. ధర్మాన్ని సదా అనుసరించాలి. అధర్మాన్ని ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు.

భావోద్వేగాలు అదుపులో ఉన్నాయా?
మనిషి ప్రవర్తనకు ప్రధాన కారణం అతనిలో కలిగే భావావేశాల పరంపర. ఆవేశం, కోపం వంటి గుణాలు మనిషిలోని విచక్షణను నశింపజేస్తాయి. ఆలోచనలు రాకుండా చేస్తాయి. అలాంటి ఆవేశమే హత్యలు, ఆత్మహత్యలకు కారణమవుతుంది. క్షణికావేశం కలిగినప్పుడు నిభాయించుకోగలిగితే అనేక అనర్థాలకు అడ్డుకట్టవేయవచ్చు. విచక్షణ వల్లనే బ్రహ్మహత్య, గోహత్య, శిశుహత్య, స్త్రీ హత్య వంటి అత్యంత పాపకార్యాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి భావోద్వేగాలు అదుపులోపెట్టుకోవాలి. అది సాధనతో చేకూరుతుంది.

హత్య చేసిన వారికి
తప్తకుంభ నరకంలో శిక్ష ఉంటుంది. పెద్ద బానల్లో నూనె, ఇనుప రజను వేసి అవి సలసలా కాగుతున్నప్పుడు అందులో వేయిస్తారు.

పరుల సొమ్ము పామే…
మనిషి ఆశాజీవి. కానీ హద్దుల్లేని ఆశ అనర్ధాలకు కారణమవుతుంది. మనిషిలోని విచక్షణను చంపేస్తుంది. తప్పు చేయించేందుకు కూడా వెనకాడదు. ఇతరుల ఆస్తి, సొమ్మును ఆశించేలా చేయడంతో పాటు అపహరణ వంటి పనులు కూడా చేయిస్తుంది. పర స్త్రీ, ఇతరుల ధనం కోసం ఆశ పడడం శిక్షార్హమని చెబుతుంది గరుడ పురాణం.

ఇతరుల ఆస్తిపాస్తులు కాజేసిన, సొమ్ము అపహరించిన వారికి
తమిశ్రం అనే శిక్ష ఉంటుంది. కాలపాశంతో కట్టేసి జీవుడి స్క్ష్మూ శరీరం నుంచి రక్తం కారేలా యమభటులు కొడతారు.

అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. పురాణాలన్నీ రచించిన వ్యాసమహర్షే దీన్ని కూడా రచించారు. ధర్మ, కర్మ, పాపాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని తన వాహనమైన గరుత్మంతుడి కోరిక మేరకు శ్రీమహావిష్ణువు బోధించాడు కాబట్టి దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది. నైమిశారణ్యంలో శౌనకాది మునులకు సూత మహాముని దీనిని కూడా వివరించాడు. ఇందులో మొత్తం 18 వేల శ్లోకాలున్నాయి. పురాణాల్లో సాత్త్విక, రాజస, తామస అనే మూడురకాలు ఉంటాయి. గరుడ పురాణం సాత్విక పురాణం. ఇందులో పూర్వఖండం, ఉత్తరఖండం అనే రెండు భాగాలు ఉంటాయి. పూర్వఖండంలో విష్ణువును ఎలా ఆరాధించాలి, తులసీ మాహాత్మ్యం, ఏకాదశి వ్రతవిధానం, నామ మహిమ, సదాచార విధానం మొదలైన అంశాలు ఉంటాయి. ఉత్తరఖండాన్ని ప్రేతకల్పం అంటారు. ఇందులో మరణించిన తర్వాత మనిషి పొందే అవస్థలు, యమలోకంలో మనిషికి విధించే శిక్షలు మొదలైన వివరాలు ఉంటాయి

గరుడ పురాణం ప్రకారం మరికొన్ని శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఏ పాపం చేసిన వారికి ఆ నరకంలో శిక్ష అమలవుతుంది. వీటన్నిటినీ సూక్ష్మశరీరంతో జీవుడు అనుభవించాల్సి ఉంటుందని ఈ పురాణం చెబుతుంది.

*కల్తీ వంటి తప్పులకు పాల్పడేవారికి కుంభీపాకం అనే శిక్ష విధిస్తారు. అందులో సలసల కాగే నూనెలో పడేస్తారు
* వేదాల్ని ధిక్కరించిన వారికి కాలసూత్ర నరకం ప్రాప్తిస్తుంది. ఇందులో జీవుడి సూక్ష్మశరీరాన్ని కత్తులతో కోస్తారు. కొరడాలతో బాదుతారు
* అతిథులకు భోజనం పెట్టనివారికి, వారిని సమాదరించని వారికి క్రిమి భోజనం అనే నరక శిక్ష ఉంటుంది. క్రిములతో నిండిన కుండల్లో పాపిని పడేస్తారు
* శుచి, ఆచారం పాటించనివారిని పూయోద అనేక నరకంలో శిక్ష విధిస్తారు. ఇందులో మలమూత్రాలు నిండిన సముద్రంలో పడేస్తారు
* అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వతశిఖరాల నుంచి కిందకు పడేస్తారు. దీన్ని అవీచిమీంత నరకం అంటారు.
* ఇతర ప్రాణులను హింసించే ఉగ్రస్వభావం కలిగినవారికి దండసూకర నరకంలో శిక్ష ఉంటుంది. ఇక్కడ పాములు ఎలుకల్ని హింసించినట్లు హింసిస్తారు
* గ్రామాలకు కీడు చేసేవారిని వజ్రాల వంటి కోరలు ఉన్న జాగిలాల చేత కరిపిస్తారు. దీన్ని సారమేయోదన నరకం అని అంటారు.
* జూద వ్యసనపరులకు రౌరవ నరకం తప్పదని గరుడ పురాణం చెబుతుంది. ఇక్కడ పాపిని జంతువులతో కరిపిస్తారు.
* గదుల్లో, నూతుల్లో ఇతరులను బంధించేవారిని విషపు పొగలు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. దీన్ని అవధ నిరోధక నరకం అంటారు
.#Garudapuranam #Hell #Wisenes #obedience