Mahardasa

మహర్దశ
Author: Mydhili Venkateswara Rao
Pages: 296

216.00

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

మహర్దశ
– మైథిలీ వెంకటేశ్వరరావు

Pages: 296
Author: Mydhili Venkateswara Rao

మన మాటల ద్వారానే లాభమైనా, నష్టమైనా

సరళంగా ప్రేమగా మాట్లాడడం ద్వారా, అర్థం చేసుకుని మాట్లాడడం ద్వారా, మంచి విషయాలు మాట్లాడడం ద్వారా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం ద్వారా, తక్కువగా మనసు నొప్పించకుండా మాట్లాడడం ద్వారా, చిరునవ్వుతో మాట్లాడడం ద్వారా ధనమూ, సుఖాలు కలుగుతాయి. పైవాటికి భిన్నంగా మాట్లాడితే దుఃఖాలు, సమస్యలు. వెరసి ధననష్టాలు అపారం.

* * *

అవి మానేస్తేనే సకల భోగాలను అనుభవించగలరు

ఆలోచనని తుంచేది, సామర్థ్యాన్ని తగ్గించేది, కడుపు నిండా తిననీయకుండా చేసేదీ.. అందమైన అనుభవాన్ని అనుభవించాలంటే మాటల ద్వారా మాత్రమే చేయించేది, అవేశంగా అనాలోచితంగా నిర్ణయాన్ని తీసుకునే స్థితికి తెచ్చి అనేక ఆర్థిక నష్టాలను, అవమానాలను చవి చూపించేది, పగనీ ప్రతీకారాన్నీ పెంచి ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని మీకు తెలియకుండానే దిగజార్చేది.. మిత్రులనీ బంధువులనీ దూరం చేసేదీ ఏదైనా సరే ఓ స్టేజీలో మాట్లాడడానికే తప్ప చెయ్యగలిగే శక్తులనీ హరించేది అయిన అవి మానేస్తేనే ధనం తాలూకూ భూమిపైనున్న అసలు సిసలు సుఖాలను అనుభవించగలరు… అవి ధన రూపేణా స్త్రీని పొందడం… ఇంకా మద్యం.

* * *

కత్తికి రెండు వైపులా పదునుండాలి

బాధలూ, సమస్యలూ… కష్టాలూ అన్నీ వచ్చేవి మన చుట్టూ వున్న వారి వల్లే. అలాంటప్పుడు వాటి నుంచి బయటపడాలంటే ఏం జరుగుతుందో ఎవ్వరెలా ప్రవర్తిస్తున్నారో తెలీదు. అలాంటి విషమ స్థితిలో కాపాడేది రెండో వైపు పదును. అంటే మనకున్న పరిచయాలు, స్నేహాలు. అన్నీ రెండు వైపులా వుండాలి. అటు ఇటు, ఇటు అటు ఎట్టి పరిస్థితులలోనూ కలవకూడదు. ఏ వైపు తేడా వచ్చినా రెండో వైపు నుంచి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

Tags: LBD