Hari Vamsam in Telugu

హరివంశము
– అయల సోమయాజుల నీలకంఠేశ్వర

324.00

Share Now

Description

Hari Vamsamu book

AUTHOR : Ayala Somaijula ​​Neelakanteswarra

హరివంశము
– అయల సోమయాజుల నీలకంఠేశ్వర.
Pages : 448

అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ

జగమెరిగిన రచయిత జగన్నాథశర్మ. కథ, నవల, నాటకం, బాల సాహిత్యంతోపాటు, సౌందర్యవంతంగా  జీవించే కళలు నేర్పే చిన్న కథలు. వ్యాఖ్య, విమర్శ, ఉపన్యాసం, సంపాదకత్వం, టీవీ, సినిమా…

ఇలా అన్ని ప్రక్రియల్లోనూ ఆరితేరిన ప్రతిభగల పురస్కారాల రచయిత. పురాణేతిహాసాలను పాఠకులకు             పట్టుబడేలా పుంఖానుపుంఖాలుగా రాస్తున్న నవ్య వీక్లి సంపాదకులు, సీనియర్‌ జర్నలిస్టు జగన్నాథశర్మ.

నవ్య వీక్లిలో రెండేళ్ళపాటు వెలువడి అశేష పాఠకాభిమానం చూరగొన్న శ్రీకృష్ణుని వంశ చరిత్ర ‘హరివంశము’. భారతశేషంగా వ్యాసుడు రాసిన హరివంశాన్ని ఎఱ్ఱాప్రగడ తెలుగులోకి అనువదించారు.

దాని ఆధారంగా జగన్నాథశర్మ (అరణి) సరళ వ్యావహారికంలో పాఠకులకు అందజేశారు.

వ్యాసుడు వైశంపాయనుడికి హరివంశ చరిత్ర చెప్పాడు. దానిని వైశంపాయనుడు, జనమేజయునికి వినిపించాడు.

ఆ యాదవేశ్వరుల మహనీయచరితను నైమిశారణ్యంలో శౌనకాది మునులకు ఉగ్రశవసుడు కర్ణపేయంగా చెప్పడంతో జగన్నాథశర్మ ఈ పుస్తకాన్ని ప్రారంభించి, 98 కథలుగా చక్కటి భాషలో మనకందించారు జగన్నాథశర్మ.

అన్నదమ్ములైన బలరామకృష్ణుల విజయగాథ ఈ హరివంశము. దాదాపు 17–18మంది మహారాక్షసులను        సంహరించిన శ్రీకృష్ణుని వీరోచిత గాథ. పల్లె వనరుల్ని రక్షించి, ప్రజలను అనుక్షణం కాపాడిన ఒక                        నాయకుడి గాథ. దుష్టులను జయింపసాధ్యం కానప్పుడు, నగరం శత్రుదుర్భేద్యం కానప్పుడు.

రక్షిణ ప్రాంతానికి తరలిపోవడం శ్రేయస్కరమని తలచి అద్భుతమైన ద్వారక నిర్మాణం చేసిన ఒక దీర్ఘదర్శి  గాథ.

గురువు కోర్కె తీర్చడం కోసం యుముణ్ణి సైతం ఎదిరించిన ధీశాలి కథ, తనపై వచ్చిన ఆరోపణలను తానే రుజువుచేసుకున్న నిజాయితీపరుని కథ, కట్టెదుట నిల్చి చేయిచాచిన వైరికి వెరవక, మూడడుగులు దానం   చేసిన మహాదాత బలిచక్రవర్తి కథ, ఇష్టసుఖుణ్ణి ఎంచుకునే స్వేచ్ఛ అనాదిగా ఈ గడ్డపై ఉన్నదని  చాటిచెప్పే  రుక్మిణీ కల్యాణం, ఉషాపరిణయాలకథ ఇది.

సంతానం కోసం కఠోర తపస్సుచేసి భార్య కోరిక  తీర్చిన భర్త కథ, ఎనమండుగురు పట్టమహిషులుసహా, పదహారువేలమంది తరుణులను పెళ్ళాడి, లక్షా 86  వేలమంది కుమారులకు తండ్రిగా మారిన ఆ          శ్రీమన్నారాయణుని కథ.

వేలాది పాత్రలు, లక్షాలాది భావాలతో, పిపీలకం నుంచి బ్రహ్మాండం వరకు విస్తరించిన వైవిధ్యాన్ని            సాక్షాత్కరింపజేసి ప్రకృతిలో, జీవ వైవిధ్యంలో దైవాన్ని ఎందుకు సందర్శించాలో మనకు కర్తవ్యబోధ  చేసే హరివంశ కథ ఈ పుస్తకం. సమకాలీన సమాజంలోని ఎన్నో మర్మాలు, సృష్టిలోని మహాద్భుతాలను   చాటిచెప్పే అత్యుత్తమ గాథ శ్రీకృష్ణ చరిత్ర.