Description
మాయావి మహిమ
టిటిడి చెప్పని తిరుమల చరిత్ర లోకానికి తెలియని టిటిడి చరిత్ర లోకాన్నీ , టిటిడినీ ఆడుకుంటూ ఆదుకుంటున్న ‘మాయావి’ మహిమ ! ‘మాయావి’తో చెలగాటమాడుతున్న మాయావులకు హెచ్చరిక !! దేవుడున్నాడు జాగ్రత్త !!
“దేవుడున్నాడు జాగ్రత్త” పుస్తకానికి హిందూ సమాజం స్పందన ఊహించినదానికంటే బాగా ఉంది. “వెయ్యేళ్ల ధర్మ యుద్ధం” తొలుత వెయ్యి కాపీలు వేస్తే నెలతిరక్కుండా రిప్రింటు అవసరమైంది. ఈ సారి ధైర్యంచేసి “దేవుడున్నాడు..” పుస్తకం మొదటే ఐదు వేల కాపీలు వేశాము. డిసెంబర్ 18 న అమ్మకాలు మొదలుపెడితే రెండువారాల్లోనే రెండువేల కాపీలు చెల్లి పోయాయి.
మా మిత్రుడు, పారిశ్రామిక ప్రముఖుడు చెరువు రాంబాబు గారు 350 ప్రతులు కొనుక్కుని యోగ్యులైన వారికి ఉచితంగా అందజేస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధానార్చకులు శ్రీ రంగరాజన్ గారు , అర్చక సమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయ బాబు గారు , అర్చక సంఘం నాయకుడు రాంబాబు గారు… ముంబయిలో మహారాష్ట్ర తెలుగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు జగన్ బాబు గారు, నా మిత్రుడు, జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్య గారు ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేయటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్, విజయవాడ బుక్ ఫెయిర్ లలో అమ్మకాలూ బాగా జరిగాయి.ఆన్ లైన్ , అమెజాన్ అమ్మకాలు సరేసరి.
పుస్తకం చదివిన పెద్దలు, విజ్ణులు, మేధావులు అందరి స్పందన పాజిటివ్ గా ఉన్నందుకు సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, టిటిడి అధిపతులు , పూజ్య ధర్మాచార్యులు , హైందవ ప్రముఖులు నేను ఎత్తి చూపిన అంశాలను, చేసిన సూచనలను సాకల్యంగా పరిశీలిస్తున్నారు. వివిధ స్థాయిల మేధామథనం ఒక మేలిమలుపు కు దారి తీస్తే సంతోషం.
Send Your Messages Only 




































