Bhakti Makarandam

భక్తి మ‌క‌రందం

198.00

Out of stock

మీ ఈమెయిల్ ఇచ్చిన యెడల, పుస్తకము స్టాక్ వచ్చిన వెంటనే మీకు ఈమెయిల్ పంపగలము

మరిన్ని Telugu Books కై
Share Now

Description

Bhakti Makarandam | భక్తి మ‌క‌రందం

మిత్రులు, ఆధ్యాత్మిక సహచరులు డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ గారు ఈనాడు దినపత్రికలో మకరందం అనే శీర్షిక కింద ప్రతీ గురువారం రాసిన ఆధ్యాత్మిక వ్యాసాలు దాదాపుగా అన్ని నేను చదివాను. ఏ దేవత గురించి రాసినా సమగ్ర సమాచారం అందించడం, చివర సారాంశప్రాయంగా తత్త్వార్థం అందించడం వారి ప్రత్యేకత. ఈ వ్యాసాల ప్రారంభంలో వర్ధమాన రచయిత అనిపించుకున్న వీరు ఇటీవల మార్గదర్శక రచయితగా ఎదిగారు. ఇదంతా వారి స్వయంకృషి.- డా. గరికిపాటి నరసింహారావు

 

అమృతస్వాదుమయమైన సనాతన విజ్ఞానాన్ని అధ్యయనం చెయ్యటం, అవగాహన చేసుకోవటం అంత సులువైన విషయం కాదు. అవగాహన చేసుకున్నా నేటి తరానికి కావలసిన సమన్వయ ధోరణిలో, సరళసుందరంగా అందించటం మరింత కష్టంతో కూడుకున్న విషయం. ఆలోచనలో సంప్రదాయం, అభివ్యక్తిలో ఆధునికత మేళవించుకున్న వ్యక్తిత్వం గల సాహితీవేత్తకు మాత్రమే అది సాధ్యం. అలాంటి అరుదైన అద్భుత కార్యాన్ని అలవోకగా సాధించిన సాహితీమిత్రులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ,

పురాణకథల్లో అంతర్యాలను విశదీకరించినా, పాత్రల, సన్నివేశాల సంకేతాలను వెల్లడించినా, చారిత్రక వ్యక్తుల ఔన్నత్యాన్ని వ్యాఖ్యానించినా, గహనమైనశాస్రాంశాలను సుబోధకం చేసినా… లక్ష్యసూత్రం మాత్రం ఒక్కటే. నేటితరం భారతీయతను గుర్తించాలి. మన సంస్కృతిలోని మహనీయతను ఈ తరానికి కరతలామలకం చెయ్యాలి. పాశ్చాత్య నాగరకతా వ్యామోహమనే విషవలయం నుంచి నేటి యువతను విముక్తులను చెయ్యాలి. భారతీయ సంస్కృతీ కల్పవృక్ష ఛాయలో వారికి ఊరట కలిగించాలి. అందుకు యువతరం సారధ్యం వహించాలి. ఈ లక్ష్యంతో ఈ జాతికి స్ఫూర్తిని అందించాలి. ఇది ఒక్కటే లక్ష్యం.

చెప్పటం వేరు, నచ్చజెప్పటం వేరు. విషయాన్ని వివరించటం వేరు, హృదయాన్ని అలరించటం వేరు. ఏమి చెబుతున్నామనే విషయంలో రామకృష్ణ ఎంత జాగరూకతను సాధించారో, ఎలా చెబుతున్నామనే విషయంలోనూ అంత మెలకువను పాటించారు. సరళ సుందరమైన భాషలో, సహజ సుందరమైన శైలిలో హృద్యంగా, మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే విధంగా ఈ వ్యాసరచన సాగింది. – ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి