Description
మనిషి ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ధర్మాచరణ ఎంత కష్టమయినా స్థితప్రజ్ఞత్వంతోఎలా నడుచుకోవాలో తెలియజేసే రసరమ్య కావ్యమే రామాయణం. పోతపోసిన నిలువెత్తు ధర్మమే శ్రీరామచంద్రుడు. కుమారుడుగా, భర్తగా, అన్నగా, ప్రభువుగా ఆయన సమస్త మానవాళికీ ఆదర్శప్రాయుడై జీవించాడు. ఇంకా సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు, గుహుడు,శబరి వంటి ఉదాత్తమైన పాత్రలు మానవలోకానికి మరువలేని మేలుని చేకూర్చాయి. ఇటువంటి అద్భుత ఇతిహాసాన్ని పిల్లల కోసం అందమైన బొమ్మలతో సరళమైన తెలుగులో అందిస్తున్నారు ఈ పుస్తకం తప్పక పిల్లలను పెద్దలను అలరించగలదని ఆశిస్తున్నాం.
పిల్లల బొమ్మల భారతం పుస్తకం రంగు రంగు బొమ్మలతో సచిత్రంగా భారతంలోని భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, ద్రుపదునికి గుణపాఠం, ధర్మరాజు, దుష్ట చతుష్టయం, లక్క ఇల్లు, ఘటోత్కచుడు, అర్జునుడి విజయం, యక్ష ప్రశ్నలు, కృష్ణరాయభారం, భగవద్గీత, అభిమన్యుడుల గురించి వివరించారు సంపాదకులు రెడ్డి రాఘవయ్య గారు.
ఈ పుస్తకంలో పరిక్షిత్తు, శృంగిశాపం, అవతారాలు, వంద సంవత్సరాల గర్భం, గజేంద్రమోక్షం, దూర్వాసుడి శాపం, పాలసముద్ర మథనం, కూర్మావతారం, మృతసంజీవని, అదితి విలాపం, వామనుడు, మత్స్యావతారం, అంబరీషుడు, పరశురాముడు, శ్రీరాముడు, కృష్ణావతారం కధలు వివరించబడ్డాయి.
పిల్లల కోసం సులువైన భాషలో, తేలికైన పదాలతో రంగురంగుల బొమ్మలతో ఈ కథలను అందిస్తున్నారు వొరుగంటి రామకృష్ణ ప్రసాద్.