Description
అత్తగారి కథలు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భానుమతీ రామకృష్ణ వ్రాసిన పుస్తకం. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి అవార్డు అందుకొన్నది.
ఈ పుస్తకం పరిచయం – “గిరీశం, కాంతం, ఎంకి, గణపతి, పార్వతీశంలలా కలకాలం నిలిచిపోయే పాత్రలలో భానుమతీ రామకృష్ణ సృష్టించిన అత్తగారు కూడా చేరతారు. ఎందుకంటే ఈ పాత్ర వాస్తవమైనదీ, జీవంతో తొణికిసలాడేదీను. ఈ కథలో అత్తగారు కోడలితో ఒద్దికగా ఉంటుంది. ఇంటిపెత్తనమంతా అత్తగారిదే. కాని ఆవిడ వఠి పూర్వకాలపు చాదస్తపు మనిషి. హాస్యం పుట్టేది ఇక్కడే”
1994లో ఈ రచనకు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.