Vishwa Vijetha | Life History of Srila Prabhupada | Yandamuri Veerendranath

viswa vijeta in telugu

విశ్వవిజేత

 శ్రీల ప్రభుపాద వారి జీవిత కథ 

“ఇస్కాన్ / హరే కృష్ణ ఉద్యమం గురించి అందరికీ తెలుసు. అయితే ఇస్కాన్ ఫౌండర్ గురించి మనలో ఎంతమందికి తెలుసు. ❓
నలభై రూపాయలతో అమెరికాకు వెళ్లి ఇస్కాన్ అనే మహా వృక్షాన్ని ఎలా స్థాపించారు.❓
అమెరికన్ హిప్పీలను మన సంస్కృతి సంప్రదాయాలకు ఎలా చేరువ చేసారు❓ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జగన్నాధ రథయాత్రలు జరగానికి కారణం ఎవరు❓
కృష్ణభక్తితో విశ్వవిజేత ఎలా అయ్యారు.”❓
“ఈప్రశ్నలన్నిటికి సమాధానం,
మన ప్రియతమా రచయిత
యండమూరి వీరేంద్రనాథ్  గారు రచించిన విశ్వవిజేత”

243.00

+ Rs.80/- For Handling and Shipping Charges
Share Now

Description

 ఈ పుస్తకం కేవలం కృష్ణ సంకీర్తన గురించి మాత్రమే కాదు. మొక్కవోని ధైర్యంతో ఒక భక్తుడు “విశ్వవిజేత”గా ఎదిగిన పరిణామక్రమం. దానికి కావలసిన అంకిత భావం, నమ్మకం, దీక్ష, మరియు సంకల్పం. ప్రతి యువకుడు తెలుసుకోవలసిన, ఆచరించవలసిన వాస్తవ జీవిత గాధ….      యండమూరి వీరేంద్రనాథ్

      20వ శతాబ్దం మధ్యలో అమెరికా ప్రధాన నగరాల్లోని జనబాహుల్యానికి ప్రాచీన భారతదేశ వైదిక బోధనలను పరిచయం చేస్తూ పాశ్చాత్య సంస్కృతిని అత్యంత ప్రభావితం చేసిన “హరే కృష్ణ ఉద్యమం” లేదా ఇస్కాన్ (ISKCON) సంస్థాపకాచార్యుల స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఈ ఉద్యమం సామాన్య ప్రజానీకం నుండి అలెన్ గిన్స్‌బర్గ్, జార్జ్ హారిసన్ వంటి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరినీ ఆకర్షించింది. సుమారు 100 కు పైగా దేశాల్లో  అనుచరులను కలిగుంది. శ్రీల ప్రభుపాద అమెరికా మరియు భారతదేశాన్ని మారిస్తే, వారి జీవిత కథ మీ జీవితాన్ని మారుస్తుంది. ఆత్మ సాక్షాత్కారం వైపు ప్రోత్సహిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

యండమూరి వీరేంద్రనాథ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్, ప్రవృత్తి రీత్యా రచయిత మరియు వ్యక్తిత్వ వికాస నిపుణులు.  ఆయన రచనలు తమిళం, కన్నడ, మలయాళం, ఆంగ్లం, హిందీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

అతను మోటివేషనల్ స్పీకర్  మరియు ఆస్ట్రేలియా, టాంజానియా, ఇండోనేషియా, సింగపూర్, US మరియు, UK లలో ప్రసంగాలు చేశారు.ఆయన సినీ దర్శకుడు కూడా. 30కి పైగా చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్నారు. అతను ఉత్తమ దర్శకత్వం మరియు నిర్మాణం కోసం బంగారు నంది అవార్డులు, భారత రాష్ట్రపతి నుండి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు మరియు మరెన్నో గెలుచుకున్నారు. ఇటీవల ఆయన రాసిన ‘విజయానికి అయిదు  మెట్లు’ తెలుగు సాహిత్యంలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
viswa vijeta in telugu