Description
వేదము “విద్” అను ధాతువు నుండి పుట్టిన వేదమునకు శృతి అనియు, ఆమ్నాయము అని పేర్లు ఉన్నాయి. వేదము కర్మ కాండము, ఉపాసనా కాండము, జ్ఞాన కాండము అని మూడు భాగములు.
వేదము మంత్రములనియు, బ్రాహ్మణములనియు, ఆరణ్యకములనియు మూడు విధములు. పూర్వము వలే కంఠస్థము చేయు సమర్ధులు కలి యుగములో ఉండరని వ్యాసుడు గ్రహించి ఈ వేదములను నాలుగు భాగములుగా విడదీసెను.
1 ఋగ్వేదము
2 యజుర్వేదము
3 సామవేదము
4.అథర్వణ వేదము
ప్రమాణాలలో మొదటిది వేదం. దాని తరువాత ధర్మ శాస్త్రాలు, పిదప పురాణాల వల్ల తెలియదగిన ఋషుల నడవడి. ఆ తరవాత శిష్టాచారం, చివరి ప్రమాణం మనస్సాక్షి. ఈ క్రమాన్నే మనం అనుసరించాలి. కాని ఈ కాలంలో అన్నీ తలక్రిందులయ్యాయి. ఇప్పుడు మొదట మనస్సాక్షి, చిట్ట చివరకు వేదం ప్రమాణం !
వేద వేద్యుడగు పరమపురుషుడు దశరధాత్మజుడుగ అవతరించి నందున రామాయణ రూపం దాల్చిన వేదసారం రామనామంలో అణిగి ఉంది. ఆ రామనామం చిత్తమాలిన్యాన్ని పోగొట్టి వేరొక దానిపై ఆశ కలుగనీయక, సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తుంది.
Vedas in Telugu