Sri Vishnu Nidhi

శ్రీ విష్ణు నిధి – శివ అభిషేకాలు – పూజలు – ధూపములు
– మైథిలీ వెంకటేశ్వరరావు

216.00

మరిన్ని Telugu Books కై
Tag:
Share Now

Description

శ్రీ విష్ణు నిధి – శివ అభిషేకాలు – పూజలు – ధూపములు
– మైథిలీ వెంకటేశ్వరరావు

శ్రీ మహా విష్ణువు పూజల గురించి, ఇతర ఆధ్యాత్మిక అంశాల గురించి చక్కని సమాచారం అందిస్తున్నారు రచయిత ఈ పుస్తకంలో.

తిథి తెలుసుకుంటే సంపద పెరుగుతుందా…

ఏ గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చు…

శత్రువు ఇంట ఎడమకాలు పెడితే…

సువర్ణగన్నేరు పుష్పాలతో పూజిస్తే…

సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేస్తే ధన ఆయుష్షులు పెరుగుతాయి…

ఇలా ఎన్నో… అన్నీ శాస్త్రాల్లోనివే… వేదాల్లోనివే….

ఇతిహాసాలలోనివే… తాళపత్రాల్లోనివే… మన పెద్దలు చెప్పినవే…

ఆచరించినవే.. సౌభాగ్య సంతోష సిద్ధులను ఇచ్చినవే….

* * *

శ్రీమహావిష్ణువు పూజలో వాడకూడనివి

మందారము, జిల్లేడు, ఉమ్మెత్త, బూరుగ, దేవకాంచనము, తాండ్రలు వాడరాదు. అలాగే నరసింహ స్వామికి వీటితో పాటు రంగుల మొగలిపూవులను కూడా వాడకూడదు.

శ్రీమహావిష్ణువు పూజలో ఏ పూవు శ్రేష్టమైనది

తమ్మి పూలకన్నా, జమ్మి పూలకన్నా, మారేడుకన్నా, అవిసె పూలకన్నా, నందివర్థనాలకన్నా, గన్నేరు పూలకన్నా, సంపెంగల కన్నా, అశోకపుష్పములకన్నా, తెల్లగులాబీల కన్నా, తెల్లని సన్నజాజులకన్నా, వసంతకాలం మల్లెలకన్నా, తామర పూలకన్నా జాజిపువ్వు శ్రీమహావిష్ణువుకు మహా ప్రీతికరమైనది. జాజిపూలతో మాలను చేసి ఆ మాలను శ్రీమహావిష్ణువుకి భక్తితో అర్పించితే వచ్చే ఫలమే మహా పరాక్రమము, కీర్తి, సంపదలు.

శ్రీహరికి ప్రీతికరమైన పత్రములు

ఉత్తరేణి, చండ్ర, జమ్మి, గరిక, దర్భ, దమనము, మారేడు, బిల్వము… వీటితో పాటు అత్యంత ప్రీతికరమైనది తులసి. ఎవరైతే తులసితో స్వామిని పూజిస్తారో వారి దోషాలను పూర్తిగా స్వామి తొలగించి వేస్తాడు.

* * *

Tags: LBD, sri siva nidhi, Mydhili Venkateswara Rao, Maithili Venkateswara Rao,shiva, Abhishekam, Pooja, Dhoopam