Description
సరళంగా *రామాయణ కథామృతం.*
రచన: శ్రీ మామిడి పూడి రామకృష్ణయ్య.
రామాయణం ఎంత త్రాగినా తనివి తీరని అమృతం. అటువంటి రామాయణామృతమును సరళ సుందరంగా అందించారు ఈ గ్రంథ రచయిత.
న్యాయవాది గా వృత్తిని నిర్వహించిన రామకృష్ణ గారు తీరిక వేళల్లో ఇతర న్యాయవాదులతో ఒక చోట చేరి వాల్మీకి రామాయణ రసవత్ ఘట్టాలు ను చాలాకాలం చెప్పుకొన్నారు. అలా చెప్పుకొన్న రామాయణము నే ఆనాడు గ్రంధం గా తీసుకొని రావడ జరిగింది. 1962 లో వచ్చిన ఆ గ్రంథాన్ని తిరిగి వారి పుత్రులు ఆధునిక ప్రమాణాలతో చాలా చక్క గా ముద్రించారు.
చాలా సరళమైన తెలుగులో బాలకాండ పర్యంతము యుద్ధ కాండ వరకు రచించారు….
సందర్భానుసారంగా చాలా సంస్కృత శ్లోకాలను ఉదహరించారు.తెలుగు భావం కన్నా సంస్కృత భావం అధికం గా ఉన్న సంస్కృత పదాలను అలానే రాయడం గ్రంధం యొక్క మరొక అందము.
వాల్మీకి రామాయణం తప్ప అన్య విషయాల జోలికి వెళ్లకుండా అద్భుతమైన రచన. వాల్మీకి భావనకు దగ్గరగా ఉన్న మాటలు రచయితవి అయితే ప్రత్యేకంగా బ్రాకెట్స్ లో చూపించారు….
ఒక్కసారి గ్రంధం చదవటం ప్రారంభిస్తే గ్రంథమే మనల్ని చదివిస్తుంది.
సంక్షేప రామాయణం,ఆదిత్య హృదయం, బ్రహ్మ కృతశ్రీ రామస్తుతి ప్రత్యేకంగా పారాయణ కోసం అందించడం కొస మెరుపు.