Manu Charitra in telugu

మను చరిత్ర

 

504.00

Share Now

Description

మను చరిత్ర | Manu Charitra in telugu
– రచన: అల్లసాని పెద్దన

అల్లసాని పెద్దనగారి పేరు వినని తెలుగువారు
సాహితీప్రియులు ఉండరన్నది అతిశయోక్తికాదేమో
ఈయన శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానంలోని
అష్టదిగ్గజాలలో మొదటివాడుకూడా
ఈయన మనుచరిత్రలో అదేనండీ
స్వారోచిషమనుసంభవము అనే ప్రబంధంలో
సృష్టించిన ప్రవరుని గురించి ఇక్కడ చూద్దాం-
ప్రవరుఁడు అంటే నిఘంటువులో శ్రేష్ఠుడు, మేటి అని ఉన్నాయి.
అందుకే ప్రవరుని గుణాలను చాల చక్కనైన శ్రేష్ఠమైన గుణాలు
కలవానిగా తీర్చిదిద్దాడు పెద్దనగారు. ఆ గుణాలను పెద్దనగారి
పద్యాలలోనే చూద్దామా….
వరుణానదీ తీరంలో అరుణాస్పందం అనే ఊరు అందులో
నివసించే బాపడు ప్రవరుడు.
.
#ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రుఁడంబురుహ గర్భకులాభరణమ బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూవిలాసుఁడై
(మనుచరిత్ర 1-51)
.
మన్మథునివలె, చంద్రునివలె, అందమైన
శరీరంకలవాడును, భాషలో రెండవ ఆదిశేషుడునూ అయి
సమస్త యాగాల్లోను, స్వచ్ఛమైన ధర్మకార్యాల్లోను,
దీక్ష ఆసక్తికలవాడు, బ్రాహ్మణజాతికి అలంకారమైనవాడు,
నిరంతరమూ వేదాధ్యయనమునందు ఆసక్తికలవాడు,
ప్రవరాఖ్యుడను పేరుకలవాడు ఆ పట్టణం(అరుణాస్పదాన్ని)
విడువక(ఎక్కడికీ వెళ్ళకుండా) ఉండేవాడు.
.
వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
కాంక్ష సేయుజారకామినులకు
భోగబాహ్య మయ్యెఁ బూచినసంపెంగ
పొలుపు మధురాంగనలకుఁబోలె –
.
తుమ్మెద అన్ని పూవులమీదా వాలుతుంది
ఒక్క సంపెంగ పూవుపై తప్ప దానిపై వాలెనా
చచ్చి వూరుకుంటుంది. తుమ్మెదలకు సంపెంగ
పనికిరానట్లే ఎంత అందగాడైనా ప్రవరాఖ్యుడు
జారవృత్తి లేనందున ఆ ఊరిలోని జారకామినులకు
పనిరానివాడైనాడు.
.
యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడు నై కమనీయ కౌతుక
శ్రీనిధిఁ గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిద్మ సౌ
భ్యావహ యై భజింప సఖులై తలిదండ్రులు గూడి దేవి యున్
దేవరబోలె నుండి యిలు దీర్పఁగఁ గాపుర మొప్పు వానికిన్
.
అతడు ధనవంతుడై, తనకు ఈడుజోడైన భార్య సేవలు
చేస్తుండగా పడుచుదనంలోనే యజ్ఞంచేసి తల్లిదండ్రులు
ఇంటిలో సుఖులై ఇంటిని సర్దుతుండగా కాపురం చేసూ
ఉండినాడు.