Description
vaddiparti padmakar books CLIK…
ఒక దివ్య ముహూర్తాన అమ్మవారు స్వప్న దర్శనంలో ఇచ్చిన ఆజ్ఞను శిరసావహిస్తూ పూజ్య గురు దేవులు వ్యాసాంతరాత్మను తన అంతర్మాతలో కలుపుకొని, “శ్రీ మద్దేవీ భాగవత” పురాణ సుధా రసాన్ని సరళమైన భాషలో స్వేచ్ఛానువాదంగా భక్తులకు అందించారు.
“రాసింది రాయించింది అంతా అమ్మే” అని స్వయంగా పూజ్య గురుదేవులే ప్రకటించిన ఈ దివ్య పురాణం యొక్క మొదటి భాగం చదివి శ్రీ మాత అనుగ్రహానికి పాత్రులు కండి.
అత్యంత పవిత్ర పురాణం “శ్రీ మద్దేవీ భాగవతం” . ఈ గ్రంధాన్ని చదువలేక పోయిన వారు ఇంట పుజించినా అనేక శుభ ఫలితాలు పొందుతారు. కనుక ఈ మహాపవిత్ర గ్రంథాన్ని ఇంట ఉంచి పూజించి, ఇంటిని అమ్మవారి నివాసమైన మణిద్వీపంగా మార్చుకొని భక్తులందరూ తరించెదరుగాక!
భోగ మోక్షాలు రెండూ ఇచ్చే పురాణముగా పురాణ ప్రారంభంలో వేదవ్యాసుడే స్వయంగా వర్ణించిన “శ్రీమద్దేవీ భాగవతం” చదివిన వారికి ఇహము, పరము రెండూ లభిస్తాయి. చదవలేని వారు, చదివించుకొన్నా అదే ఫలితాన్ని పొందుతారు. మొత్తం చదవలేనివారు ఇందులోని శ్లోకం లేదా అర్థ శ్లోకం చదివినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఏ ఇంట్లో దేవీ భాగవతము నిత్యం పూజింపబడుతుందో ఆ ఇల్లు మహాతీర్థం అవుతుంది. ఆ ఇంట్లో నివసించే వారికి సకల పాపాలు నశించిపోతాయి. అట్టి ఈ పట్టువిత్ర గ్రంధాన్ని చదివి, చదివించుకొని తరించండి.