Description
శ్రీ శంకరుల గ్రంధాలన్నింటిలో ‘వివేక చూడామణి’ ప్రత్యేక స్థానాన్ని అలంకరించింది. ఆత్మ జ్ఞాన విషయం ఇంత సులభ రీతిన మరే ఇతర గ్రంథం లోనూ ప్రతిపాదింపబడలేదని పండితుల అభిప్రాయం. అయిదు వందల ఎనభై శ్లోకాలతో ఉన్న ఈ గ్రంధం, వేదాంత విజ్ఞాన వినీలాకాశంలో జ్వాజ్యల్యమానంగా ప్రకాశిస్తున్న ధృవ తార అని కీర్తింపబడింది. ముముక్షువులకు పెన్నిదియై, అజ్ఞాన తమోభాస్కరమై భాసిస్తూ సర్వ వేదాంత విషయాలనూ కరతలామలకంగా అందిస్తున్న ఈ మహత్గ్రంధం అనేకులకు నిత్య పారాయణయోగ్యమై ఉన్నది. అంతటి మహత్తరమైన ఈ వివేక చూడామణి గ్రందాన్ని మూల సంస్కృత శ్లోక సహితంగా తాత్పర్యాలను తేట తెలుగులో అందిస్తున్నది. -వ్యాసాశ్రమం