Vatsayana KamaSutralu Telugu

వాత్సాయన
కామసూత్రాలు

 

750.00

Share Now

Description

కామసూత్ర పీఠికలో వాత్సాయనుడు అతని కంటే పూర్వపు గ్రంథకర్తల యొక్క రచనలు తన రచనకి ఎలా ఉపయోగపడ్డాయో ప్రస్తావిస్తాడు. తన రచనలోని ఏడు భాగాలు దత్తకుడు, సువర్ణనభుడు, ఘోతకముఖుడు, గోనర్దియుడు, గోనికపుత్రుడు, చారాయణుడు,, కుచుమారుని రచనల యొక్క సంగ్రహాలని తెలుపుతాడు. వాత్సాయనుని కామసూత్రాలు 1250 పద్యాలతో, 36 విభాగాలు, 7 భాగాలుగా వ్రాయబడ్డాయి. బర్టన్,
 
1. పరిచయం (సం
సాధారణం) – మొదటి విభాగంలో పుస్తక విషయము, అమరిక గురించి క్లుప్తంగా వివరించబడింది. పరిచయభాగములోని ఇతర విభాగాలు జీవిత గమ్యాలు ప్రాముఖ్యత, విజ్ఞాన సముపార్జన, సజ్జనులు, ఉన్నత కుటుంబాలనుండి వచ్చిన నాగరీకుల నడవడిక, విటునికి సహాయపడే మధ్యవర్తుల గురించిన విషయాలను చర్చించబడ్డాయి (5 విభాగాలు).
2. శృంగార కలయిక (సం
సంప్రయోగికం నామ ద్వితీయ అధికరణం ) – విభాగాలు కామోద్దీపనం, ఆలింగనాలలో రకాలు, నిమురుట , చుంబనములు, నఖక్షతాలు, దంతక్షతాలు, రతి భంగిమలు, తాడనాలు, అనుబంధిత శీత్కారాలు, అధిక లైంగిక శక్తి గల స్త్రీల గురించి, ఉపరతి , ముఖ రతి, రతికేళి యొక్క అంత్యారంభాల గురించి వివరిస్తాడు. దీనిలో 64 రకాల కామ క్రీడలు వివరించాడు (10 విభాగాలు).
 
కామసూత్రములో వివరించబడిన ఒక రతి భంగిమకు చిత్రరూపము. కామసూత్ర రెండవ భాగములో వివిధ రతిభంగిమలు వివరించబడినవి కానీ ఎటువంటి రేఖాచిత్రాలు లేవు.
3. భార్యను పొందే విధానం (సం
కన్యా సంప్రయుక్తకం) – విభాగాలు వివాహంలో రకాలు, స్త్రీ ని ప్రశాంతంగా ఉండేట్లు చేయటం, స్త్రీ ని పొందు విధానం, ఒంటరిగా గడపటం, వైవాహిక సంగమం (5 విభాగాలు).
4. భార్యాధికరణం (సం
భార్యాధికారికం): ఒక్కతే భార్య , ముఖ్యమైన ఇతర భార్యల ప్రవర్తన (2 విభాగాలు).
5. ఇతరుల భార్యల గురించి
ఈ విభాగాలలో స్త్రీ, పురుషుల ప్రవర్తన, పరిచయం పెంచుకోవటానికి మార్గాలు , పద్ధతులు, మనోభావాలని పరీక్షించటం, రాయబారాలు నెరపే విధానం, రాజభోగాలు, గర్భాశయము యొక్క నడత (6 విభాగాలు).
6. వేశ్యాధికరణం (సం
పారదారికం ): ఈ విభాగం విటుల ఎంపిక, స్థిరమైన విటుని కొరకు వెతకటం, డబ్బు సంపాదించటానికి మార్గాలు, పాత ప్రేమికునితో తిరిగి స్నేహం చిగురింపజేయటం, అనుకోకుండా కలిగే లాభనష్టాలు మొదలైన వాటిపై వేశ్యలకు సూచనలు ఇస్తున్నది (6 విభాగాలు).
7. ఇతరులను ఆకర్షించడం గురించి (సం
ఔపనిషాధికం): ఈ భాగంలో శారీరక ఆకర్షణను మెరుగుపరచుకోవటం, వశీకరణం, లైంగిక బలహీనతలను అధిగమించడం వంటి విషయాలు చర్చించాడు (2 విభాగాలు).